Burkina Faso: ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో మారణహోమం జరిగింది. మూడు గ్రామాలపై వారం రోజుల క్రితం జరిగి దాడుల్లో 170 మందిని కిరాతకంగా చంపేసిటనట్లు ప్రాంతీయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఫిబ్రవరి 25న యటెంగా ప్రావిన్స్‌లోని కొమ్‌సిల్గా, నోడిన్ మరియు సోరో గ్రామాలపై జరిగిన దాడులకు సంబంధించి నివేదికలు అందాయని, దాదాపుగా 170 మందికి మరణశిక్ష విధించారని అలీ బెంజమిన్ కౌలిబాలీ చెప్పారు. ఈ ఘటనపై తమ కార్యాలయం విచారణకు ఆదేశించిందని చెప్పారు. బాధితుల్లో డజన్ల కొద్దీ మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని, దాడుల నుంచి బయటపడిన వారు చెప్పారు.
Read Also: Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత.. మార్చి ప్రారంభంలోనే మండిపోతున్న భానుడు
వారం క్రితం ఉత్తర బుర్కినా ఫాసోలోని మసీదు, చర్చిలపై దాడులు జరిగాయి. అయితే, ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించలేదు. బుర్కినా ఫాసో 2015 నుంచి ఇస్లామిక్ తీవ్రవాదంతో బాధపడుతోంది. మాలి దేశం నుంచి ఆల్‌ఖైదా, ఇస్లామిస్ స్టేట్‌తో సంబంధం ఉన్న తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ హింస కారణంగా దాదాపుగా 20,000 మంది మరణించారు. రెండు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ప్రపంచంలో అత్యంత పేదదేశంగా ఉన్న బుర్కినా ఫాసో అస్థిరతతో కొట్టుమిట్టాడుతోంది. 2022లో జరిగిన రెండు సైనిక తిరుగుబాట్లు దేశ భద్రతను ప్రశ్నార్థకంగా మార్చాయి.