British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్

  • ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్
  • లండన్‌ నుంచి చికాగో వెళ్తుండగా ఘటన
  • ఐర్లాండ్‌ మీదుగా ఉండగానే వెనక్కి మళ్లింపు
British

British

గత వారం ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ ముప్పు నుంచి బయటపడిన ఘటన మరువక ముందే బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో కూడా అవే సంకేతాలు వెలువడ్డాయి. లండన్‌ నుంచి చికాగో వెళ్తున్న విమానంలో ఎమర్జెన్సీ కోడ్ వచ్చింది. దీంతో అప్రమత్తం కావడంతో ఐర్లాండ్‌ మీదుగా ఉండగానే వెనక్కి మళ్లించారు.

బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం BA295… లండన్‌ నుంచి అమెరికాలోని చికాగోకు బయలుదేరింది. ఐర్లాండ్‌ గగనతలంలో ఉండగా ఎమర్జెన్సీ ప్రకటించింది. అనంతరం విమానాన్ని తిరిగి లండన్‌కు మళ్లిస్తున్నట్లు విమాన ట్రాకింగ్ డేటా వెల్లడించింది. విమానంలోని ట్రాన్స్‌పాండర్‌ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు ‘7700’ స్క్వాక్ కోడ్‌ ప్రసారం అయింది. విమానయానంలో 7700 కోడ్‌ను సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఐర్లాండ్‌ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం సుమారు 9,000 అడుగుల ఎత్తుకు దిగినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చూపించింది. ఆ తర్వాత విమానం తిరిగి లండన్ వైపు మళ్లినట్లు సమాచారం.

అసలు సమస్య ఏంటి?

విమానంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తిందన్న విషయం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. సాంకేతిక సమస్యా? వైద్య అత్యవసర పరిస్థితా? లేక మరేదైనా కారణమా? అనే దానిపై స్పష్టత లేదు. విమానయాన సంస్థ లేదా సంబంధిత అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించిన తర్వాతే ఎమర్జెన్సీకి అసలు కారణం ఏంటన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.