Site icon NTV Telugu

Brazil: 10వ అంతస్తు నుంచి పడి బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి.. ఏం జరిగిందంటే..!

Brazilian Influencer

Brazilian Influencer

బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సిల్వా (25) 10వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. నవంబర్ 29న అపార్ట్‌మెంట్ భవనం వెలుపల చనిపోయి కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త, వ్యాపారవేత్త అలెక్స్ లియాండ్రో(40)ను అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. సీసీటీవీ ఫుటేజ్‌కు లింక్ కుదరకపోవడంతో డిసెంబర్ 9న అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: క్షమాపణ చెప్పు లేదంటే చంపేస్తా.. హిజాబ్‌పై నితీష్‌కు పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ వార్నింగ్

సిల్వాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 6,500 మంది ఫాలోవర్లు ఉన్నారు. సావో పాలోలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. అయితే నవంబర్ 29న 10వ అంతస్తు నుంచి పడి చనిపోయి ఉంది. తొలుత అనుమానాస్పద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇరుగుపొరుగు వారిని విచారించగా ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినట్లుగా చెప్పారు. అంటే భార్యాభర్తల గొడవ తర్వాత ఆమె చనిపోయినట్లుగా కనిపెట్టారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీలను పరిశీలించగా సిల్వాపై భర్త దాడి చేసిన దృశ్యాలు కనిపించాయి. పార్కింగ్ గ్యారేజీలో దాడి జరిగినట్లుగా గుర్తించారు. అనంతరం లిఫ్ట్‌ లోపల కూడా వాగ్వాదం వాదించుకుంటున్నట్లు కనిపించింది. అనంతరం మెడను పట్టుకుని బలవంతంగా లాగుతున్నట్లు రికార్డైంది. క్షణాల తర్వాత లిఫ్ట్ దగ్గరకు భర్త ఒంటరిగా వస్తున్నట్లు కనిపించింది. దీంతో భర్తే చంపి ఉంటాడని అనుమానిస్తూ అరెస్ట్ చేశారు.

Exit mobile version