ఈరోజు సాయంత్రం న్యూషెపర్డ్ వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేయబోతున్నది. రోదసిలోకి ప్రయాణం చేయబోతున్న ఈ నౌకను తిరిగి వినియోగించేందుకు అనువుగా తయారు చేశారు. పశ్చిమ టెక్సాస్‌లోని ఎడారి నుంచి వ్యోమనౌక రోదసిలోకి ప్రయాణం చేస్తుంది. నిట్టనిలువుగా పైకి దూసుకెళ్లే ఈ నౌక భారరహిత స్థితికి చేరుకున్నాక, నౌన నుంచి బూస్టర్ విడిపోతుంది. విడిపోయి తరువాత బూస్టర్ తిరిగి నేలకు చేరుకుంటుంది. వ్యోమనౌక అక్కడి నుంచి మరింత ఎత్తుకు చేరుకుంటుంది. కర్మన్ రేఖను దాటి పైకి వెళ్లిన కాసేటి తరువాత ఈ నౌక తిరుగు ప్రయాణం అవుతుంది. భారరహిత స్థితిలో ఉన్నప్పుడు ఆ నౌకలోని ప్రయాణిలుకు సీటు బెల్టు తీసేసి భారరహిత స్థితిని పొందుతారు. తిరిగి నౌక భూవాతావరణంలో ప్రవేశించిన తరువాత సీటుబెల్టు పెట్టుకుంటారు. ఈ నౌక క్రమంగా కిందకు దిగుతూ పారాచూట్‌లను తెరుచుకుంటుంది. గంటకు 16 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించుకుంటూ నేలపైకి దిగుతుంది.
Read: తెలకపల్లి రవి: ఇన్‌సైడర్ ట్రేడ్ కేసు కొట్టివేసిన సుప్రీం, వచ్చే మార్పు ఏముంటుంది?
