Site icon NTV Telugu

Bird Flu: బర్డ్ ఫ్లూ మరో మహమ్మారిగా మారుతుందా..? పరిశోధకులు ఏం చెబుతున్నారు..?

Bird Flu

Bird Flu

Bird Flu: 2019లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ అన్ని దేశాల్లో మరణాలకు కారణమైంది. కోవిడ్-19 మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ ప్రపంచం మరిచిపోలేకపోతోంది. ఇదిలా ఉంటే సమీప భవిష్యత్తులో మరో పాండెమిక్ వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దానిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు సిద్ధం అవుతున్నాయి.

అయితే, ఈ సారి వచ్చే మహమ్మారి బర్డ్ ఫ్లూ అవుతుందా..? అంటే అందుకు అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. H5N1 అని పిలువబడే వ్యాధి ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2020 నుంచి బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోందని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా కన్జర్వేషర్ బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ డయానా బెల్ అభిప్రాయపడ్డారు. 1997లో చైనాలో బాతుల్లో ఈ వ్యాధి ఉద్భవించిన తర్వాత పలు ప్రాంతాలకు వ్యాపించింది. పక్షులతో పాటు నాన్-ఏవియన్ జాతులను ప్రభావితం చేసింది.

Read Also: Tiger attack: పెద్ద పులి దాడి చేసినా బెదరలేదు, ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడంటే..

డాక్టర్ బెల్ పరిశోధన ప్రకారం.. 2020 నుంచి 26 దేశాల్లోల అనేక క్షీరద జాతులు వైరస్ బారిన పడినట్లు నివేదించారు. ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్‌లు కూడా దీనికి ప్రభావితమయ్యాయి. బర్డ్ ఫ్లూ వల్ల వివిధ జంతు జాతుల్లో మరణాలు సంభవించాయి. మానవుల్లో సైతం ఈ వ్యాధి కనిపించింది. గతేడాది 23 దేశాల్లో 882 బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీని ఫలితంగా 52 శాతం మరణాలు రేటు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫౌల్ట్రీల నుంచి మానవుల్లోకి ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఇది ఎక్కువగా ఉంది.

బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి సోకే ప్రమాదం ప్రస్తుతానికి లేనప్పటికీ, సమీప భవిష్యత్తులో అంటు వ్యాధిగా మారగల సామర్థ్యం గురించి పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) దీనిని మహమ్మారి ముప్పుగా పరిగణిస్తోంది. వైరస్ అనుకూలత, మరిన్ని జాతులకు హాని కలిగించే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు, నిఘా అవసరమని డాక్టర్ బెల్ హైలెట్ చేశారు. ఫౌల్ట్రీ పద్ధతుల్లో మార్పు చేయాలని, ఇంటెన్సివ్ ఫార్మింగ్ పద్ధతుల నుంచి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

Exit mobile version