Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగాలని సొంత పార్టీ కీలక నేతలే డిమాండ్లు చేస్తున్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు టాక్. పార్టీ సీనియర్ నాయకురాలు నాన్సీ పెలోసీ నేరుగా జో బైడెన్‌కే కాల్ చేసి.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరినట్లు పలు కథనాలు వచ్చాయి. బైడెన్ తప్పుకోకపోతే డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు సీఎన్‌ఎన్ వెల్లడించింది. జో బైడెన్ అయితే ట్రంప్‌ను ఓడించలేరని నాన్సీ పెలోసీ అభిప్రాయపడ్డారు. బైడెన్ వెనక్కి తగ్గాలని కాలిఫోర్నియా డెమోక్రటిక్ ప్రతినిధి ఆడమ్ కూడా వేడుకున్నారు. దీంతో పార్టీ ప్రతినిధి తొలిసారిగా బహిరంగంగా పిలుపునిచ్చారు.
Read Also: Darling Movie Review: లేడీ అపరిచితురాలు ‘డార్లింగ్’.. ఎలా ఉందంటే?
ఇక, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని రోజుల్లోనే, జో బైడెన్‌కు కూడా బెదిరింపులు రావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. బెదిరింపులకు పాల్పడిన జేసన్ పాట్రిక్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని పేర్కొన్నారు. ట్రంప్‌పై కాల్పుల కేసులో ఎఫ్‌బీఐ చేతికి ఒక ఆధారం దొరికింది.