NTV Telugu Site icon

Joe Biden: పుతిన్‌పై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. ఉక్రెయిన్‌ను ఏమి చేయలేకపోయారని వ్యాఖ్య

Joebiden

Joebiden

ఉక్రెయిన్‌, పశ్చిమాసియాల్లో సంక్షోభాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో చివరి ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అండగా నిలిచియాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిపిన యుద్ధం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఇక పశ్చిమాసియా సంక్షోభంతో పాటు సుడాన్‌లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.

ఇది కూడా చదవండి: Jayam Ravi: నన్ను ఇంటి నుంచి గెంటింది.. భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు

దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను అంతం చేస్తామని ప్రకటించారు. అలాగే దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడతామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పుడు.. నాటో మిత్రదేశాలు, ఇతర భాగస్వాములు ఇలా 50కి పైగా దేశాలు కలిసికట్టుగా అండగా నిలిచినట్లు గుర్తుచేశారు. ఈ పరిణామాలు కారణంగానే పుతిన్ యుద్ధం విఫలమైందన్నారు. ఉక్రెయిన్ ఇప్పుడు స్వేచ్ఛగా ఉందని తెలిపారు. నాటోను కూడా బలహీనపరిచేందుకు పుతిన్‌ యత్నించారని.. కానీ అది సాధ్యం కాలేదన్నారు. ఫిన్లాండ్, స్వీడన్‌ కొత్తగా వచ్చి చేరడంతో నాటో మరింత బలపడిందని బైడెన్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Kanaka: సీనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!