Site icon NTV Telugu

Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం… తిర‌స్క‌రించిన జెలెస్కీ…

ర‌ష్యా ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్యా బ‌ల‌గాలు ఇప్ప‌టికే ఉక్రెయిన్‌లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ దేశాన్ని త‌న చేతుల్లోకి తీసుకోవాల‌ని పుతిన్ ఆదేశాలు జారీ చేయ‌డంతో పోరును పెద్ద ఎత్తున చేస్తున్నారు. ర‌ష్యా బ‌ల‌గాల‌కు ధీటుగా ఉక్రెయిన్‌కూడా పోరాటం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే దాదాపు 3500 మంది ర‌ష్యన్ బ‌ల‌గాల‌ను హ‌త‌మార్చిన‌ట్టు ఉక్రెయిన్ చెబుతున్న‌ది. అయితే, దీన్ని ర‌ష్యా దృవీక‌రించ‌డం లేదు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ కు అమెరికా భారీ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది.

Read: Bheemla Nayak Hit : జోష్ లో ఎ.ఎం.రత్నం, మైత్రీమూవీస్

ర‌ష్యాతో పోరాటం చేసేందుకు ఉక్రెయిన్‌కు రూ.2.63 వేల కోట్ల సైనిక సాయాన్ని ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్ ర‌క్ష‌ణ‌కోసం ఈ మొత్తాన్ని వెచ్చించాల‌ని నిర్ణ‌యించింది. ఇక‌పోతే అటు ఫ్రాన్స్ సైతం ఉక్రెయిన్‌కు 10,16 వేల కోట్ల రూపాయ‌ల సాయం అందించేందుకు ముందుకు రాగా, దానికి ఉక్రెయిన్ సున్నితంగా తిర‌స్క‌రించింది. మిత్ర దేశాల నుంచి త‌మ‌కు ఆయుధాలు, సామాగ్రి అందుతున్నాయ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు పేర్కొన్నారు.

Exit mobile version