ప్రధాని మోడీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన నాయకులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే.. ప్రధాని మోడీని ‘‘విష్ణువు అవతారం”గా అభివర్ణించారు. 2019లో న్యూఢిల్లీలో మోడీతో జరిగిన వ్యక్తిగత భేటీ తనపై ప్రత్యేక ప్రభావం చూపిందని గుర్తుచేశారు.
మోడీలో జ్ఞానం, కరుణ, ధైర్యం, నిస్వార్థ సేవ వంటి లక్షణాలను తాను చూశానని టోబ్గే తెలిపారు. భూటాన్ బౌద్ధ సంప్రదాయంలోని ఆదర్శ నాయకత్వ భావనతో ఈ లక్షణాలను ఆయన అనుసంధానించారు. అలాగే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న మోడీ లక్ష్యాన్ని కూడా ప్రస్తావించారు. 2019 జూలై 27న ఢిల్లీలో మోడీని కలిసిన విషయాన్ని టోబ్గే గుర్తుచేసుకున్నారు. అప్పటికి ఆయన భూటాన్ ప్రధానిగా లేరు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఓడిపోవడంతో పార్లమెంట్‌లో కూడా ప్రాతినిధ్యం కోల్పోయింది. దీంతో మోడీని తాను ఒక సాధారణ పౌరుడిగా కలిశానని టోబ్గే తెలిపారు. తన పదవీకాలంలో మద్దతు ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పానని, ఇకపై కూడా ఆయనను తనకు అన్నయ్యగా భావిస్తానని చెప్పినట్లు టోబ్గే వివరించారు. మోడీ తనపై చూపిన ఆప్యాయతే ఇందుకు కారణమని తెలిపారు.
మోడీకి 25 ఏళ్లు
మోడీ వరుసగా 25 సంవత్సరాలు ప్రభుత్వ అధిపతిగా కొనసాగిన సందర్భంగా టోబ్గే ఈ వ్యాఖ్యలు చేశారు. 2001 అక్టోబర్ 7న మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు విజయాల అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు
To Prime Minister @narendramodi,
An avatar of our times https://t.co/84RDOEfELm— Tshering Tobgay (@tsheringtobgay) October 7, 2026

