Site icon NTV Telugu

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా ఆ గుహ‌నుంచే వ‌చ్చిందా?

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా వైర‌స్ చైనాలోని యువాన్ ప్రావిన్స్ లో ఉన్న గుహ‌లు కార‌ణం అని ప్ర‌పంచం భావిస్తోంది.  ఆ గుహ‌ల నుంచి వైర‌స్ ఊహాన్‌కు అక్క‌డి నుంచి ప్ర‌పంచానికి విస్త‌రించిన‌ట్టు అంత‌ర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.   ప్ర‌స్తుతం యునాన్‌లో ఉన్న గుహ‌ల‌ను పూర్తిస్థాయి భ‌ద్ర‌త క‌ల్పించిది చైనా.  ఎవ‌రిని అటువైపు వెళ్ల‌నివ్వ‌డంలేదు.  చైనా అద్య‌క్షుడి అనుమ‌తి ఉన్న ప‌రిశోధ‌కుల‌కు మాత్ర‌మే అక్క‌డికి వెళ్లేందుకు అనుమ‌తి ఉంది.  ఇక చైనా ప‌రిశోధ‌కులు గుహ‌లో చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు సంబందించిన ప‌త్రాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు స‌మ‌ర్పించాలి.  టాస్క్ ఫోర్స్ నేరుగా వాటిని అద్య‌క్షుడికి స‌మ‌ర్పిస్తుంది.  2002లోనే గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ లో 2003లో ప‌లు దేశాల‌కు పాకింది.  2012లో యునాన్ ప్రావిన్స్ లోని టోంగ్ గువాన్‌లో కొంద‌రు కూలీలు గ‌బ్బిలాల విస‌ర్జితాల‌ను తొల‌గిస్తూ జ‌బ్బున ప‌డ్డారు.  వీరిలో సార్స్ ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.  సార్స్ తో పోరాటం చేసే యాంటిబాడీలు వారి శ‌రీరంలో క‌నిపించ‌డంతో అప్ప‌ట్లోనే క‌రోనా వైర‌స్ సోకినట్టు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  అయితే, డిసెంబ‌ర్ 8 న 2019 న చైనాలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాపించ‌డం ప్రారంభ‌మైంది.  అక్క‌డి నుంచి పెద్ద ఎత్తున కరోనా ఇత‌ర దేశాల‌కు వ్యాపించింది.  

Exit mobile version