బంగ్లాదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆందోళనలు, నిరసనలతో రక్తసిక్తమైంది. గత నెల నుంచి జరుగుతున్న కోటా ఉద్యమం ఆగస్టులో మరింత తీవ్ర రూపం దాల్చి తీవ్ర హింసకు దారి తీసింది. ఇప్పటి వరకు 300 మంది ప్రాణాలు కోల్పోగా.. గత ఆదివారమే దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ ఆందోళనల్లో పిల్లలతో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ఆదివారం వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. దీంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. ఇదిలా ఉంటే ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి విదేశాలకు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
జూలై 19న ప్రభుత్వ ఉద్యోగాల కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ ఘటనలో 67 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర అశాంతికి దారి తీసింది. గత నెల చివరలో ప్రారంభమైన నిరసనలు క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. దేశంలోనే అతిపెద్దదైన ఢాకా యూనివర్శిటీలో విద్యార్థులు-పోలీసుల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
ఇది కూడా చదవండి: Anchor Suma: స్టేజ్ మీద సుమ చేతిని ముద్దాడిన నటుడు.. షాకింగ్ కామెంట్స్