Site icon NTV Telugu

Baloch Liberation Army: పాకిస్తాన్‌కి షాక్.. కీలకమైన నగరాన్ని చేజిక్కించుకున్న బీఎల్ఏ..

Balochistan

Balochistan

Baloch Liberation Army: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆ దేశ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బలూచ్ ఆర్మీ కంట్రోల్ పెరిగింది. క్వెట్టా వంటి రాజధాని మినహా చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టు లేదు. ఇప్పటికే, పాక్ ఆర్మీ టార్గెట్‌గా బీఎల్ఏ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, కీలకమైన సురబ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ యోధులు ప్రకటించారు. నగరంలో అనేక పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలను బీఎల్ఏ టార్గెట్ చేసి దాడులు చేసింది.

Read Also: Global Optimism Index: ఆపరేషన్ సిందూర్ తర్వాత ‘‘ఆశావాద సూచిక’’లో భారత్ 4వ ర్యాంక్..

నగరంలోని పోలీస్ స్టేషన్లు, ప్రధాన బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో సహా మొత్తం నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. తీవ్ర ఘర్షణలో పాక్ సైన్యం, పోలీస్ దళాలను విజయవంతంగా వెనక్కి నెట్టామని పేర్కొంది. ఆపరేషన్ సమయంలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్(SHO) ను చంపడానికి, పోలీసు సిబ్బంది నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడానికి బీఎల్ఏ బాధ్యత వహించారు.

బీఎల్ఏ ప్రతినిధి జయంద్ బలూచ్ సురబ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక ప్రకటన విడుదల చేశారు. 40,000 జనభా ఉన్న ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత క్వెట్టా-కరాచీ, సురబ్-గద్దర్ రోడ్ పై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గస్తీని విధించారు. కీలకమైన రవాణా మార్గాలను మూసేశారు. శుక్రవారం సాయంత్రం వివిధ ప్రభుత్వ కార్యాలయాలపై భారీ సంఖ్యలో బలూచ్ ఫైటర్స్ దాడులు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాడి సమయంలో అనేక మంది అధికారుల్ని బందీలుగా పట్టుకున్నారు.

Exit mobile version