NTV Telugu Site icon

Kazakhstan: విమాన ప్రమాదంలో 42 మంది మృతి.. మిగతా వారంతా సేఫ్!

Kazakhstan

Kazakhstan

కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 42 మంది మృతి చెందినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా వారంతా క్షేమంగానే ఉన్నట్లు పేర్కొంది. ప్రమాద సమయంలో విమానం రెండు ముక్కలైపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిపోగానే భారీగా మంటలు ఎగిసిపడి రెండు భాగాలుగా విడిపోయింది. ఓ భాగం నుంచి ప్రయాణికులు బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. ఇంకో భాగంలో మాత్రం మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపు చేశారు.

కజకిస్థాన్‌లోని అక్తావు నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో 25 మంది ప్రాణాలతో బయటపడ్డారని స్థానిక వార్తా సంస్థ బుధవారం మధ్యాహ్నం తెలిపింది. 11 ఏళ్ల బాలిక, 16 ఏళ్ల యువకుడితో సహా 22 మంది ఆసుపత్రి పాలయ్యారు. 42 మంది మరణించారని కజకిస్థాన్ అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ జెట్‌కు చెందిన విమానంలో 62 మంది ప్రయాణికులు మరియు ఐదుగురు సిబ్బందితో బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళుతోంది. అయితే భారీ పొగమంచు కారణంగా దాదాపు 1800 కి.మీ దూరంలో ఉండగా.. తిరిగి అక్తావు మళ్లించబడింది. అయితే విమానం అక్తౌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే సంక్షోభం మొదలైంది. దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు పైలట్ అభ్యర్థించాడు. ఇంతలోనే ఊహించని విపత్తు జరిగిపోయింది.

ఇదిలా ఉంటే విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టిందని, దీనివల్ల స్టీరింగ్ పనిచేయకపోవడం లేదా ఒక ఇంజిన్ దెబ్బతినడం జరిగిందని ప్రాథమిక నివేదికలు అందుతున్నాయి. పైలట్లు వేగం, ఎత్తును నియంత్రించడానికి ప్రయత్నించినా విఫలమయ్యారు. అయితే విమానం విమానాశ్రయానికి మూడు కి.మీ దూరంలో ఉండగా కూలిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూమిలోకి దూసుకుపోయిన దృశ్యాలు కనిపించాయి. అంతేకాకుండా గాల్లో ఉండగా విమానం భారీ కుదుపులకు లోనైట్లుగా కూడా కనిపించింది. ప్రమాదానికి ముందు మాత్రం నియంత్రణలోకి వచ్చినట్లు కనబడింది. రెండున్నర నిమిషాల వీడియోలో 36 సెకన్లలో విమానం నిటారుగా డైవ్‌లోకి వెళ్లి భూమిని తాకినప్పుడు కుడి వైపుకు వంగి మంటలు చెలరేగాయి. వెంటనే ముక్కలుగా విరిగిపోయింది.

ప్రమాదం తర్వాత కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే చాలా మంది షాక్‌లోకి వెళ్లిపోయారు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. కొందరు సాయం చేసి ఆస్పత్రికి తరలించారు. విమానంలోని ఒక భాగం నుంచి బయటకు వచ్చిన వారు భయాందోళనతో గజిబిజి అయినట్లుగా కనిపించింది.

 

 

Show comments