Site icon NTV Telugu

Ozone Hole: ఆస్ట్రేలియా కార్చిచ్చు కారణంగా పెరిగిన ఓజోన్ హోల్..

Ozone Layar, Wild Fire

Ozone Layar, Wild Fire

Ozone Hole: 2019-20 ఆస్ట్రేలియాలో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఓజోన్ పొర రంధ్రం విస్తరించినట్లు తాజా అధ్యయాల్లో తేలింది. ఆగ్నేయాస్ట్రేలియాలో దాదాపుగా నెల రోజల పాటు కార్చిచ్చు ఏర్పడింది. వేల హెక్టార్లలో అడవులు ధ్వంసం అయ్యాయి. ఈ భారీ కార్చిచ్చు విడుదలైన వాయువులు ఓజోన్ పొర పలుచగా మారేందుకు కారణం అయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి వరకు ఈ కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది.

ఈ కార్చిచ్చు వల్ల వేల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. లక్షలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయి. 36 మంది మరణించగా.. చాలా మంది ప్రజలు గాయపడ్డారు. ఈ కార్చిచ్చు వల్ల ఏర్పడిన పొగ దాదాపుగా 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఓజోన్ పొరను ప్రభావితం చేసింది. స్ట్రాటో ఆవరణంలో ఉన్న ఓజోన్ పొర ఈ పొగ వల్ల దెబ్బతిన్నట్లు కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read Also: Upasana: బేబీ బంప్ తో ఉపాసన.. పుట్టబోయే బిడ్డ గురించి చరణ్ ఏమన్నాడంటే

దీని ప్రభావం వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లోని కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ లేయర్ 3 నుంచి 5 శాతం వరకు తొలగించబడింది. సాధారణంగా ధృవాలతో పోలిస్తే దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఇటీవల సంవత్సరాల్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని వెల్లడించిన శాటిలైట్ డేటా విశ్లేషనపై ఈ అధ్యయనం ఆధారపడి ఉంది. ఓజోన్ పొరకు హాని చేయని క్లోరోఫ్లోరో కార్బన్లలో మిగిలిన క్లోరిన్, హైడ్రోక్లోరిక్ ఆమ్ల నీటి బిందువులతో కరిగిపోయి, అది ఓజోన్ లేయర్ క్షీణతకు కారణం అవుతోంది.

హైడ్రోక్లోరిక్ యాసిడ్, పొగ కణాలతో కలిసి మాలిక్యులర్ క్లోరిన్‌ను ఉత్పత్తి చేస్తుందని, ఇది అత్యంత రియాక్టివ్ ఓజోన్ ను దెబ్బతీసే క్లోరిన్ అణువులుగా విడిపోయిందని అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియలో చెలరేగిన కార్చిచ్చు వల్లే ఇది ఏర్పడినట్లు పరిశోధకలు గుర్తించారు. ఓజోన్ లేయర్ భూమికి రక్షణగా నిలిచి మానవాళిని కాపాడుతోంది. ఓజోన్ లేయర్ సూర్యుడిని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు(ఆల్ట్రావయెలెట్ రేస్) నుంచి ప్రజలను రక్షిస్తోంది. అయితే రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో వాడే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఇది దెబ్బతింటోంది.

Exit mobile version