Site icon NTV Telugu

Viral News: అండర్‌ వేర్స్‌లో వెళ్లి వాళ్లు ఏం చేశారో తెలిస్తే షాక్..!!

Australia Elections

Australia Elections

ఆస్ట్రేలియాలో ఇటీవల ఫెడరల్ ఎన్నికల్లో వందలాది మంది అర్ధనగ్నంగా పాల్గొనడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహిళలు స్విమ్‌సూట్‌ ధరించగా.. పురుషులు అండర్‌వేర్‌లో వెళ్లి ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే మహిళలు, పురుషులు ఇలా అర్ధనగ్నంగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఓ కారణముంది. ‘బడ్జీ స్మగ్లర్స్​’ అనే బట్టల కంపెనీ అక్కడి ఓటర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. అండర్​వేర్‌లో వెళ్లి ఓటేస్తూ ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్​ చేస్తే బ్రాండెడ్​ స్విమ్​వేర్‌ను ఉచితంగా ఇస్తామని తెలిపింది. దీంతో బడ్జీ స్మగ్లర్స్ కంపెనీ ఆఫర్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ ఆఫర్ పొందడానికి అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా అండర్‌వేర్‌లలో వెళ్లి ఓట్లు వేసి ఫోటోలు దిగి సోషల్ మీడియలో షేర్ చేశారు.

కాగా 2007 తర్వాత తొలిసారిగా జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబర్ పార్టీ గెలుపొందింది. దీంతో ఆ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలు ఉన్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు ఈ ఎన్నికలను నిర్వహించారు. కరోనా దృష్ట్యా 1.7 కోట్ల మంది ఓటర్లలో 48 శాతానికి పైగా ప్రజలు ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగిలిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

Exit mobile version