NTV Telugu Site icon

Australia Couple Lottery: అదృష్టమంటే ఇది.. భార్య అలిగింది, 16 కోట్ల లాటరీ తగిలింది

Australian Couple Dollars

Australian Couple Dollars

Australia Couple Won 16crs Of Lottery: ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంటను అదృష్టం వరించింది. 30 సంవత్సరాల నుంచి ఆ జంట చేస్తున్న ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. దీంతో వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అలిగిన భార్యను సంతోష పెట్టడం కోసం భర్త రెండు లాటరీలు కొనగా.. ఆ రెండూ ఒకేసారి గెలవడంతో కోట్లకు పడగలెత్తారు. మార్చి 13వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. న్యూ సౌత్‌ వేల్స్‌కు చెందిన ఓ జంట గత 30 ఏళ్లుగా ఒకే నంబర్‌పై టికెట్ కొంటూ వస్తోంది. ఏదో ఒక రోజు అదృష్టం తమ తలుపు తట్టకపోదా.. అని ఆశించినప్పుడల్లా వారికి నిరాశే ఎదురైంది. అయితే.. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత వారి ప్రయత్నం ఫలించింది. ఒకేసారి రెండు లాటరీలు తగలడంతో.. 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ.16 కోట్ల 48 లక్షలు)ను వాళ్లు గెలుచుకున్నారు.

Man Hits Daughter In Law: ఉద్యోగం చేస్తానన్న పాపానికి.. ఇటుకతో కోడలిపై మామ దాడి

ఈ అనుభవం గురించి సదరు వ్యక్తి పంచుకుంటూ.. ‘‘మాకు లాటరీ తగులుతుందన్న నమ్మకంతో గత 30 సంవత్సరాల నుంచి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాం. గత వారం నా భర్య నెంబర్‌పై లాటరీ తీసుకోవడం మర్చిపోవడంతో.. తను బాధగా ఫీల్ అయ్యింది. దీంతో.. ఆమెను సంతోషపరచడం కోసం ఆమె పేరు మీదే రెండు లాటరీలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సోమవారం ఉదయం నెంబర్‌ పరీక్షించగా.. మొదటి టికెట్‌పై ఒక మిలియన్‌ డాలర్లు(రూ. 8 కోట్లు)గెలుచుకున్నట్లు తెలిసింది. వెంటనే రెండో టికెట్‌ కూడా విన్‌ అయినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పగా.. తను ఆనందంతో ఎగిరి గంతేసింది’’ అంటూ చెప్పుకొచ్చారు. తమకొచ్చిన డబ్బులతో కూతురిని కొత్త ఇల్లు కొనిస్తానని.. తమ పిల్లల భవిష్యత్తుతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఈ డబ్బుని ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు.

Somu Veerraju: అంకెల గారడీతో మాయ చేశారు.. అప్పులను ఆదాయంగా చూపారు..!

Show comments