ఆడి ఇటలీ బాస్ ఫాబ్రిజియో లాంగో 10,000 అడుగుల పర్వతం నుంచి పడి మరణించాడు. ఇటాలియన్-స్విస్ సరిహద్దుకు సమీపంలోని ఆడమెల్లోని పర్వతాన్ని అధిరోహిస్తున్న సమయంలో 10,000 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు. ఫాబ్రిజియో లాంగో.. పర్వతానికి చేరువవుతున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగి లోయలోకి పడినట్లు సమాచారం. పర్వతాలను ఎక్కే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ఈ ప్రమాదం జరిగింది. తోటి పర్వతారోహకులు ఈ సంఘటనను గమనించి రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు. వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. రెస్క్యూ బృందాలు ఫాబ్రిజియో లాంగో మృతదేహాన్ని 700 అడుగుల లోయలో కనుగొన్నారు. హెలికాప్టర్‌లో మృతదేహాన్ని కారిసోలోలోని ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: PM Modi: జమ్మూకాశ్మీర్‌లో మోడీ ఎన్నికల ప్రచారం.. ఎప్పటినుంచంటే..!
ఫాబ్రిజియో లాంగో 1962లో ఇటలీలోని రిమినిలో జన్మించాడు. పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన ఈయన.. 1987లో ఫియట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన తన మార్కెటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. ఆ తర్వాత 2002లో లాన్సియా బ్రాండ్‌కు నాయకత్వం వహించారు. 2012లో ఆడి కంపెనీలో చేరారు. 2013లో ఇటాలియన్ కార్యకలాపాలకు డైరెక్టర్ అయ్యారు.
ప్రస్తుతం అతని మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరుగుతోంది. శవపరీక్ష మరియు ఇతర లాంఛనాలు పూర్తయిన తర్వాత లాంగో కుటుంబ సభ్యులకు అతని మృతదేహాన్ని అప్పగించారు. అంత్యక్రియలకు తేదీని ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Cardamom: చిన్నవిగా ఉన్నాయని తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..