NTV Telugu Site icon

వైరల్ః ఈ చేప ఖ‌రీదు రూ.72 ల‌క్ష‌లు… ఎందుకంటే…

అధృష్టం ఎవ‌ర్ని ఎలా వ‌రిస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు.  కష్టం ఎప్పుడూ ఊరికేపోదు.  నిత్యం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వ్యక్తుల‌కు ఎదో ఒక‌రూపంలో అదృష్టం ఎప్పుడోక‌ప్పుడు వ‌రిస్తుంది.  పాకిస్తాన్ కు చెందిన సాజిద్ హాజీ, అబు బ‌క‌ర్ అనే వ్య‌క్తులు స‌ముద్రంలో చేప‌ల వేట‌తో జీవ‌నం గ‌డుపుతుంటారు.  చాలా కాలంగా చేప‌ల వేట‌తో జీవ‌నం సాగిస్తున్న వీరికి క‌డ‌లి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.  అరుదైన‌, విలువైన చేప వీరి వ‌ల‌కు చిక్కింది.  అట్లాంటిక్ క్రోక‌ర్ అరుదైన‌, విలువైన చేప‌.  ఆసియా, యూర‌ప్ దేశాల్లో దీనికి గిరాకి ఎక్కువ‌.  48 కిలోల విలువైన ఈ చేప‌ను రూ.72 లక్ష‌ల‌కు అమ్మేశారు. అయితే, వేలంలో ఈ చేప రూ.84.2 ల‌క్ష‌లు పలికిన‌ప్ప‌టికి, సంప్ర‌దాయాల ప్ర‌కారం డిస్కౌంట్ ఇవ్వ‌డంతో రూ.72 ల‌క్ష‌ల‌కు అమ్ముడుపోయింది.