Site icon NTV Telugu

Astrologer: బైడెన్ తప్పుకుంటాడని చెప్పిన ఆస్ట్రాలజర్ జోస్యం నిజమైంది.. తదుపరి యూఎస్ అధ్యక్షుడు ఎవరంటే..?

Astrologer

Astrologer

Astrologer: జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడబోతున్నారు. అయితే, జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకుంటారని ముందే అంచనా వేసిన ఓ ఆస్ట్రాలజర్ అంచనాలు ప్రస్తుతం నిజమయ్యాయి. అమెరికాలో ప్రముఖ ఆస్ట్రాలజర్‌గా పేరు తెచ్చుకున్న అమీ ట్రిప్ తన జోస్యం కారణంగా యూఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫేమస్ అయ్యారు.

ప్రస్తుతం ఆమె అమెరికా తదుపరి అధ్యక్షులు ఎవరనే విషయాన్ని కూడా చెప్పారు. నక్షత్రాలను బట్టి చూస్తే తదుపరి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ అని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ట్రంప్ హాయాంలో మరిన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో ట్రంప్ హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. యురేనస్ తన మిడ్-హెవెన్‌లో ఉన్నాడని, ఇది ట్రంప్ కెరీర్, టార్గెట్‌లలో అనూహ్యతను చూపుతుందని చెప్పారు.

Read Also: Manu Bhaker: 16 ఏళ్ల వయసులోనే మను భాకర్ కు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం..

81 ఏళ్ల జో బైడెన్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటారని అంచనా వేసిన తర్వాత ఆమె వైరల్‌గా మారార. ‘‘ బైడెన్ పదవీ దిగిపోయే కాలం 29 డిగ్రీల మకరం వద్ద నిండు పౌర్ణమి ఉంటుంది. మకరం ప్రభుత్వాన్ని, వృద్ధాప్యాన్ని సూచిస్తుంది. 29 డిగ్రీలు ముగింపును సూచిస్తుంది. ’’ అని జూలై 11న ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది. అయితే, దీనిపై ఖచ్చితమైన తేదీని చెప్పాలని ఓ నెటిజన్ కోరగా.. జూలై 21 అని ఆమె బదులిచ్చారు. ఆమె చెప్పిన విధంగానే బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న రోజు నిండు పౌర్ణమి రోజు.

2024 యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేస్తారని ట్రిప్ ముందుగానే అంచనా వేశారు. తన రెండో శని రాక ప్రభావాన్ని అనుభవిస్తున్నందున, కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడతారని చెప్పారు. ఇదిలా ఉంటే రానున్న మరికొన్ని రోజుల్లో బైడెన్ మరిన్ని కష్టాలు ఎదుర్కోవచ్చని చెప్పారు. ఫ్లూటో సూర్యుడి మీద ఉన్నారు, అతడికి ఆరోగ్య సమస్యలు రావచ్చని చెప్పింది. ఇదే కాకుండా ఆగస్టు నెలలో అమెరికా అంతటా రాజకీయ అశాంతి నెలకొనవచ్చని అంచనా వేశారు.

Exit mobile version