NTV Telugu Site icon

AstraZeneca Vaccine: కోవిడ్ వ్యాక్సిన్‌తో మరో అరుదైన రక్త రుగ్మత..

Covid Vaccine

Covid Vaccine

AstraZeneca Vaccine: ఆస్ట్రాజెనికా కోవిడ్ వ్యాక్సిన్‌తో కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక దుష్ప్రభావాలు ఉంటాయని ఆ సంస్థ యూకే కోర్టుకు వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ వల్ల మరో రక్త రుగ్మత వచ్చే అవకాశం ఉందని తేలింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అయిన కోవిషీల్డ్ వల్ల “టీకా ప్రేరేపిత రోగనిరోధక థ్రోంబో సైటోపెనియా అండ్ థ్రోంబోసిస్(VITT)” అని పిలిచే మరొక ప్రాణాంతకమైన రక్తం గడ్డకట్టే రుగ్మతకు దారి తీసే అవకాశం ఉందని తేలింది. ప్లేట్‌లెట్ ఫ్యాక్టర్ 4 అనే ప్రోటీన్‌ని లక్ష్యంగా చేసుకుని హానికరమైన బ్లడ్ ఆటోఆంటిబాడీ వల్ల VITT వస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వైరస్‌లు, వ్యాక్సిన్‌లోని కామన్ ఫ్యాక్టర్ ఈ ప్రమాదకర యాంటీబాడీస్‌ని ప్రేరేపిస్తోందని అధ్యయనం చూపిస్తోంది.

ప్రస్తుతం అమ్మకాలు మందగించడం, యూకేలో న్యాయపోరాటం నేపథ్యంలో ఆస్ట్రాజెనికా తన వ్యాక్సిన్‌ని అంతర్జాతీయ మార్కెట్ నుంచి ఉపసంమరించుకున్నట్లు ప్రకటించిన వారం తర్వాత, ఈ కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాణాంతక రక్త రుగ్మతతో ముడిపడి ఉంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌తో ఇటీవల ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకులు తమ అధ్యయనాన్ని పంచుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2021లో VITT వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అడెనో వైరస్ వెక్టర్ ఆధారంగా ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారు చేసింది.

Read Also: Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ లో నటించనున్న ఆ సీనియర్ హీరోయిన్..?

2023లో జరిగిన ఓ పరిశోధనలో అదే ప్లేట్‌లెట్ ఫ్యాక్టర్ 4 (PF4) సాధారణ జలుబు, అడినో వైరస్ ఇన్ఫెక్షన్లలో ముడిపడి ఉన్నట్లు తేలింది. ఆటోఆంటిబాడీ అనేది రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక రకమైన యాంటీబాడీ, ఇది శరీరం యొక్క స్వంత కణజాలాలను తప్పుగా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. బయట నుంచి వచ్చిన సూక్ష్మజీవులుగా భావించి సొంత శరీర భాగాలపైనే దాడి చేస్తాయి. రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కణాలు, కణజాలాలకు హాని కలిగిస్తాయి. దీని వల్ల ప్రభావిత రోగులు తరుచుగా మెదడు, ఉదరం వంటి భాగాల్లో రక్తం గడ్డలు అభివృద్ధి చెందడం చూస్తాము. వారి రక్తంలో డి-డైమర్ అనే పదార్థం కూడా అధిక స్థాయిలో ఉంటుంది.

ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు, డాక్టర్ జింగ్ జింగ్ వాంగ్ మరియు ప్రొఫెసర్ టామ్ గోర్డాన్, గతంలో 2022లో PF4 యాంటీబాడీకి సంబంధించిన జన్యుపరమైన ప్రమాద కారకాన్ని గుర్తించారు. ఈ కొత్త అధ్యయనంలో ఫ్లిండర్స్ యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన నోవల్ మెథడ్ ద్వారా వైరస్‌లోని కామన్ ఫ్యాక్టర్ ఈ హానికరమైన యాంటీబాడీని ప్రేరేపించినట్లు వెల్లడైంది. VITT మరియు న్యాచురల్ అడెనోవైరస్ ఇన్ఫెక్షన్‌లలో PF4 ప్రతిరోధకాలు ఒకే విధమైన మాలిక్యులర్ సిగ్నేచర్‌ని పంచుకుంటాయని కనుగొన్నారు. ఈ పరిశోధన వల్ల టీకా భద్రతను మరింత మెరుగుపరచడంలో దోహదపడతాయని పరిశోధకులు వెల్లడించారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ హెమటాలజీ ప్రకారం, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న 4 నుండి 42 రోజులలోపు వ్యాక్సిన్-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT) సంభవిస్తుంది. అందువల్ల, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తీవ్రమైన తలనొప్పి, చూపులో మార్పు, పొత్తికడుపు నొప్పి, వికారం మరియు వాంతులు, వెన్నునొప్పి, శ్వాస ఆడకపోవడం, కాలు నొప్పి లేదా వాపు మరియు సులభంగా గాయాలు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి.