NTV Telugu Site icon

ఆ రెండు టీకాల‌ను మిక్స్ చేస్తే… ఎలాంటి ప్ర‌భావం క‌నిపిస్తుందంటే…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప్ర‌స్తుతం వ్యాక్సిన్ ఒక్క‌టే ప‌రిష్కారంగా క‌నిపిస్తున్న‌ది.  అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ, వేగంగా వ్యాక్సిన్‌ను అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌టం లేదు.  వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల‌కు కూడా క‌రోనా సోకుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దీంతో టీకాల‌ను మిక్స్ చేస్తే ఎలాంటి ప్ర‌భావం క‌నిపిస్తుంది అనే విష‌యంపై టీకా కంపెనీలు, శాస్త్ర‌వేత్త‌లు దృష్టిసారించాయి.  ఇందులో భాగంగా ఆస్త్రాజెన‌కా టీకాతో ర‌ష్యా స్పుత్నిక్ వి లైట్ టీకాను క‌లిపి ఇస్తే ఎలా ఉంటుంది అనే దానిపై ప్ర‌యోగాలు చేస్తున్నారు.  ప్ర‌స్తుతం 50 మంది వాలంటీర్ల‌పై ట్ర‌య‌ల్స్‌ను నిర్వ‌హించిన‌ట్టు ర‌ష్యా పేర్కొన్న‌ది.  దీనికి సంబందించిన ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది.  50 మందిపై నిర్వ‌హించిన ట్ర‌య‌ల్స్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ క‌నిపించ‌లేద‌ని, వాలంటీర్లు ఆరోగ్యంగా ఉన్న‌ట్టు ర‌ష్యన్ డెరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ పేర్కొన్న‌ది.  అజ‌ర్‌బైజాన్‌లో స్వ‌ల్ప మిక్సింగ్‌తో ప్ర‌యోగాలు చేసిన‌ట్టు రష్యా పేర్కొన్న‌ది.  

Read: సెమీస్ లో అడుగుపెట్టిన పీవీ సింధూ…