NTV Telugu Site icon

Arshad nadeem: ఒలింపిక్ విజేతపై కాసుల వర్షం.. భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన నవాజ్ షరీఫ్‌ కుమార్తె

Arshadnadeem

Arshadnadeem

పారిస్ ఒలింపిక్ విజేత అర్షద్ నదీమ్‌పై పాకిస్థాన్‌లో ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురుస్తోంది. జావెలిన్‌ త్రోలో అర్షద్ నదీమ్‌ స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించాడు. దేశానికి స్వర్ణాన్ని సంపాదించిన క్రీడాకారుడిగా అర్షద్ రికార్డ్ సృష్టించాడు. అతడి ప్రతిభకు గుర్తింపుగా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్‌.. అర్షద్ నదీమ్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా అర్షద్‌కు రూ.10 కోట్ల నగదు, ఒలింపిక్స్ నెంబర్ ప్లేట్‌తో కూడిన కారును బహుమానంగా అందించారు.

అర్షద్ నదీమ్ పరిస్థితి చాలా దయనీయమైంది. చాలా అష్టకష్టాలు అనుభవించాడు. కనీసం కోచింగ్ తీసుకునేందుకు కూడా అతడి దగ్గర డబ్బులు లేని పరిస్థితి. దీంతో అతడు విదేశాలకు వెళ్లాలంటే. గ్రామస్తులు, బంధువులు విరాళాలు వేసుకుని సాగనంపేవారు. అంతటి భయంకరమైన పరిస్థితులను జీవితంలో చవిచూశాడు. ఇప్పుడు దేశమే గర్వపడేలా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అత్యంత ప్రజాదరణ క్రీడాకారుడిగా కీర్తింపబడుతున్నాడు.

ఇప్పుడు నదీమ్‌పై నగదు బహుమతుల వర్షం కురిసింది. పాకిస్థాన్ పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ షరీఫ్ మంగళవారం మియాన్ చన్నులో నదీమ్‌ను పరామర్శించారు. అతనికి పాకిస్తాన్ రూపాయల 10 కోట్ల బహుమతిని అందజేశారు. అంతేకాకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ PAK-92.97 (అతని ఒలింపిక్ గుర్తు) కలిగిన హోండా సివిక్ కారు కూడా బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా పలు రకాలుగా బహుమతులు అందుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Show comments