NTV Telugu Site icon

Argentina: హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా.. ఆర్థిక మూలాలను జప్తు చేయాలని ఆదేశం..!

Argent

Argent

Argentina: హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అర్జెంటీనా తాజాగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసే దిశగా అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈ విధమైన ప్రకటన చేశారు. గత అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని కూడా అర్జెంటీనా తీవ్రంగా ఖండించింది. ఇక, ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది.. ఆర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ‍ప్రాంతాలపై హమాస్‌ ఉగ్రదాడులు చేసిందని.. ఈ సంస్థకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపణలు చేసింది.

Read Also: Threatening Letter: మసీదు నుండి శబ్దం వస్తే.. మృతదేహాలను లెక్కించడానికి సిద్ధంగా ఉండండి

అయితే, ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తరచూ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు చేస్తోంది. గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ ఘటనపై హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ఇక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నది అని ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైనికులు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయన్నారు. అయితే, పాలస్తీనియన్లు అక్కడికి రాగానే వారిపై ఇజ్రాయేల్ ఆర్మీ కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా పేర్కొన్నారు. పాలస్తీనియన్లంతా గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలో హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలంతా దక్షిణం వైపుకు వెళ్లాలని దానిలో కోరాయి.

Show comments