NTV Telugu Site icon

Apple Watch Saves Woman Life: యువతి ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్

Apple Watch Saves Girl Life

Apple Watch Saves Girl Life

Apple Smartwatch Detects Horrific Killer Tumor And Saves Girl Life: యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇప్పటివరకూ ఎందరో ప్రాణాల్ని కాపాడింది. శరీరంలో ఉన్న రోగాల్ని గుర్తిస్తూ.. వాటి నుంచి యూజర్లను బయటపడేసింది. తాజాగా మరోసారి ఈ యాపిల్ స్మార్ట్‌వాచ్ ఇంకో ప్రాణాన్ని కాపాడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన కిమ్ దుర్కీకి యాపిల్ వాచ్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే యాపిల్ వాచ్ కొనుగోలు చేసింది. అంతే, ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కట్ చేస్తే.. మే నెలలో రాత్రి నిద్రిస్తున్న వేళ ఆ వాచ్ అలెర్ట్ చేసింది. బహుశా అలెర్ట్‌కి సంబంధించిన సెట్టింగ్స్ ఏమైనా మారిపోయాయేమోనని కిమ్ అనుకుంది.

అయితే.. మరుసటి రోజు కూడా ఆ వాచ్ రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో కిమ్ తీవ్ర అసహనానికి గురైంది. ఆ యాపిల్ వాచ్ పాడైందేమోననుకొని, విసిరి కొట్టాలని అనుకుంది. కానీ.. ఆ వాచ్ ఎందుకు పదే పదే హెచ్చరికలు జారీ చేసిందన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఓసారి డాక్టర్‌కి చూపిస్తే అయిపోతుంది కదా! అనుకొని, కిమ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పుడు అసలు కథ వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి వైద్యులు కిమ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ఆ యువతి శరీరంలో మైక్సోమా అనే ప్రమాదమైన కణితి ఏర్పడిందని చెప్పారు. ఇది అరుదుగా ఏర్పడుతుంది, శరీరంలో పెరిగితే చాలా ప్రమాదమని, వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని, లేకపోతే గుండెకు రక్తం సరఫరా ఆగిపోయి హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు తెలిపారు.

వైద్యులు ఇచ్చిన రిపోర్ట్‌తో ఒక్కసారిగా ఖంగుతిన్న కిమ్ కుటుంబసభ్యులు.. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఐదు గంటలపాటు వైద్యులు శ్రమించి, కిమ్ శరీరం నుంచి ఆ కణితిని తొలగించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ..యాపిల్‌ వాచ్‌ వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డానని తెలిపింది. తొలుత అలెర్ట్ వచ్చినప్పుడు డాక్టర్లను సంప్రదిస్తే, ఆందోళన వల్ల ఆ అలెర్ట్ వచ్చి ఉంటుందన్నారని చెప్పింది. కానీ, మరోసారి అలెర్ట్ రావడంతో మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి డాక్టర్లను సంప్రదించామని, వాళ్లు ట్యూమర్ ఉందని గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది.

Show comments