Site icon NTV Telugu

యాంటీ వ్యాక్స్ న‌ర్సు నిర్వాకం: కోవిడ్ వ్యాక్సిన్‌కు బ‌దులుగా సెలైన్ ద్రావ‌ణం…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టాలంటే తప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ప్ర‌పంచం మొత్తం ఘోషిస్తోంది.  దానికి త‌గ్గ‌ట్టుగానే ఆర్ధిక స్తోమ‌త‌ను బ‌ట్టి వివిధ దేశాలు వ్యాక్సినేష‌న్‌ను అమ‌లు చేస్తున్నాయి.  అయితే, వ్యాక్సిన్‌ను విమ‌ర్శించేవారు, వ్యాక్సిన్‌పై న‌మ్మ‌కం లేనివారు కూడా కోకొల్లుగా ఉన్నారు.  అలాంటి వారిలో ఓ జ‌ర్మ‌న్ న‌ర్సు కూడా ఉన్న‌ది.  బ్రెజిల్ లోని ఉత్త‌ర స‌ముద్ర‌తీరంలోని ప్రైస్‌ల్యాండ్ ప్రాంతంలోని ఓ టీకా కేంద్రంలో న‌ర్సుగా ప‌నిచేస్తున్న మ‌హిళ… 8600 మందికి వ్యాక్సిన్ కు బ‌దులుగా సెలైన్ ద్రావ‌ణాన్ని ఇచ్చింది.  వ్యాక్సిన్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించే వారిలో ఈ రెడ్‌క్రాస్ న‌ర్సుకూడా ఉండ‌టం విశేషం.  ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. అమెపై చ‌ర్య‌లు తీసుకోవ‌డ‌మే కాకుండా, సెలైన్ ద్రావ‌ణాన్ని తీసుకున్న 8600 మందికి తిరిగి వ్యాక్సిన్ అందించేందుకు ప్ర‌భుత్వం సిద్ధం అయింది.  అయితే, సెలైన్ ద్రావ‌ణాన్ని ఇవ్వ‌డం వ‌ల‌న వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ క‌నిపించ‌క‌పోయినా, తీసుకున్న‌వారింతా వ‌య‌సురిత్యా పెద్ద‌వారు కావ‌డంతో క‌రోనా సోకి ఉండొచ్చ‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి.  

Read: “చిరు 153” రీమేక్ షూటింగ్ షురూ

Exit mobile version