NTV Telugu Site icon

Anti-Hijab Protests In Iran: అట్టుడుకుతున్న ఇరాన్.. ప్రభుత్వ కాల్పుల్లో 50 మంది మృతి

Hiajab Protest In Iran

Hiajab Protest In Iran

Anti-Hijab Protests In Iran: హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ వ్యాప్తంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని గత వారం మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత శుక్రవారం ఆమె కోమాలోకి వెళ్లి చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతి దేశవ్యాప్తంగా మహిళలు, యువతలో కోపాన్ని రగిల్చింది. దీంతో రాజధాని టెహ్రాన్ తో పాటు అన్ని ప్రావిన్సుల్లో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. మహిళలు హిజాబ్ ను వ్యతిరేకిస్తూ.. హిజాబ్ ను తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుని ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Read Also: Google Pixel 7 : పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రొ భారత్‌లో గ్రాండ్‌ ఎంట్రీ

ఇదిలా ఉంటే ఈ నిరసనలను క్రూరం అణిచివేసేందుకే ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడ ఇంటర్నెట్ పై తీవ్ర ఆంక్షలు పెట్టింది. ఇన్ స్టా, వాట్సాప్ సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. అయినా గతం ఎనిమిది రోజుల నుంచి నిరసన, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో 50 మంది వరకు మరణించారని.. ఓస్లోకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. ప్రభుత్వ చెప్పిన వివరాల ప్రకారం ఐదుగురు భద్రతా సిబ్బందితో కలిపి ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని ప్రకటించింది. అయితే మరణాల సంఖ్య దీని కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది.

టెహ్రాన్ నగరంలో పర్యటిస్తున్న సమయంలో మహ్సా అమిని హిజాబ్ ధరించలేదనే ఆరోపణతో, దుస్తుల నియమావళిని చూసే మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె అక్టోబర్ 16న కోమాలోకి వెళ్లి మరణించింది. అయితే పోలీసులు కొట్టడం వల్లే మహ్సా అమిని చనిపోయిందని ప్రజలు ఆరోపిస్తుంటే.. గుండె పోటుతో మరణించిందని ప్రభుత్వం వర్గాలు తెలుపుతున్నాయి. మహ్సా అమిని మరణం ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ లో ఆందోళనకు కారణం అయింది. రాజధాని టెహ్రాన్ తో పాటు ఇస్ఫాహాన్, మషాద్, షిరాజ్, మజాందరన్ ప్రావిన్స్, తబ్రిజ్‌లతో పాటు మహ్సా అమిని సొంత ప్రావిన్సు అయిన కుర్దిస్తాన్ లో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు మొదలయ్యాయి.