Site icon NTV Telugu

Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో మళ్లీ ఆంథోనీ అల్బనీస్‌దే విజయం.!

Anthony Albanese

Anthony Albanese

Australia: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోని అల్బనీస్‌కి చెందిన లెఫ్ట్ భావజాలం కలిగిన లేబర్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్థానిక మీడియా అంచనా వేస్తోంది. శనివారం సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా అల్బనీస్ పార్టీ వెళ్తున్నట్లు మీడియా సంస్థలు తెలిపాయి. తదుపరి పార్లమెంట్‌లో లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి జనాభా ఎక్కువగా ఉన్న తూర్పు రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ముగిసింది, ఇంకా రెండు గంటల ఓటింగ్ మాత్రమే మిగిలి ఉంది.

Read Also: Minister Seethakka : గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం.. కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..

ఒపీనియన్ పోల్ ప్రకారం, ప్రధాని అల్బనీస్ లేబర్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ కన్నా స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ ముగిసిన 2 గంటల్లోనే ఎన్నికల ఫలితాలు రావడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విశ్లేషకులు ప్రకారం, ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఎన్నికల్లో విస్తృతమైన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ విధానపరమైన తప్పులతో పాటు, ట్రంప్‌తో సైద్ధాంతిక సాన్నిహిత్యం ఉండటం ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. ఫెడరల్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ తన స్థానాన్ని కోల్పోబోతున్నారని ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కూడా తెలిపింది.

Exit mobile version