పాకిస్థాన్‌లో పోకిరీలు రెచ్చిపోతున్నారు.. వైద్యం కోసమో, ఇతర అవసరాల నిమిత్తమో ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలను వెంటిపడి వేధిస్తున్నారు.. ఇద్దరు మహిళలు ఓ చిన్న పిల్లాడితో ఆటోలో వెళ్తుంటే వాళ్లను బైక్స్‌పై వెంటపడి వేధించాయి అల్లరి మూకలు. ఇంతలో ఓ యువకుడు ఏకంగా ఆటో ఎక్కి… ఓ మహిళకు ముద్దుపెట్టాడు. దీంతో ఆమె భయంతో షాక్‌లోకి వెళ్లిపోయింది. అక్కడితో ఆగకుండా వాళ్లను వేధించడం ప్రారంభించారు ఆకతాయిలు. దీంతో ఆటోలోని రెండో మహిళ తన కాలి చెప్పును తీసి తమ జోలికి వస్తే చెప్పుతో కొడతానని ఆ యువకులకు వార్నింగ్ ఇచ్చింది. ఇంత జరుగుతున్నా బాధితులకు అండగా ఒక్కరూ నిలబడలేదు. పాక్ స్వతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14న ఈ సంఘటన జరిగింది.
ఆగస్టు 14వ తేదీన మినార్ ఈ పాకిస్థాన్ వద్ద టిక్‌టాక్ చేస్తున్న మహిళపై 400 మంది దాడి చేశారు. ఆమెను బంతిలా గాల్లోకి విరిసి వికృతానందం పొందారు. అక్కడితో ఆగకుండా కొంత మంది ఆమె వస్త్రాలను చించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో విపరీతంగా వైరస్ అవుతోంది. చివరికి దీనిపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పందించాల్సి వచ్చింది. అల్లరి మూకలోని అందరిపై కేసులు పెట్టాలని ఆదేశించే వరకూ బాధితురాలి గురించి పట్టించుకున్న నాథుడు లేడు. మరోవైపు… తాలిబన్ల పాలనలో మహిళలకు భద్రత ఉండదని ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. మరి పాకిస్థాన్‌లో జరుగుతున్నదేమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. పాక్ మహిళల దుస్థితి గురించి ఎవరూ మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మినార్ ఈ పాకిస్థాన్ వద్ద టిక్‌టాకర్‌పై, ఆటోలో వెళ్తున్న మహిళలకు వేధింపులు ఒకే రోజు జరిగాయి. మరీ ముఖ్యంగా పాక్ స్వతంత్ర దినోత్సవం నాడే జరిగాయి.
