NTV Telugu Site icon

Covid-Like Pandemic: మరో 10 ఏళ్లలో కోవిడ్ వంటి మరో మహమ్మారి వచ్చే అవకాశం..

Covid 19

Covid 19

Covid-Like Pandemic: 2019లో చైనా వూహాన్ నగరంలో నెమ్మదిగా మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను పట్టిపీడిస్తోంది. కోవిడ్ వ్యాధి ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా ఇప్పటికే ఈ మహమ్మారి తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో లక్షల సంఖ్యలో మరణాలకు కారణం అయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. మహమ్మారి దెబ్బతో ఇప్పటికీ ప్రపంచం కోలుకోలేకపోతోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా తన రూపాలను మార్చుకుంటూ కరోనా మహమ్మారి ఇబ్బందులు పెడుతోంది.

ఇదిలా ఉంటే కోవిడ్ లాంటి మరో మహమ్మారి 10 ఏళ్లలో ప్రపంచాన్ని తాకే అవకాశం ఉందని లండన్ చు చెందిన ఆరోగ్య విశ్లేషన సంస్థ ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ అంచనా వేసింది. వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాల్లో పెరగుదల, పెరుగుతున్న జనాభా, జూనోటిక్ వ్యాధుల ముప్పు ఈ ప్రమాదానికి దోహదం చేసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే దశాబ్దంలో కోవిడ్-19 వంటి ప్రాణాంతక మహమ్మారి సంభవించే అవకాశం 27.5% ఉందని, ఎందుకంటే వైరస్‌లు మరింత తరచుగా ఉద్భవిస్తాయని తెలిపింది. వీటిని అడ్డుకునేందుకు వేగవంతమైన వ్యాక్సిన్లతో మరణాలను తగ్గించవచ్చని తెలిపింది. కొత్త మహమ్మారి వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల్లో సమర్థవంతమైన వ్యాక్సిన్ కనుగొంటే మహమ్మారిని 8.1 శాతానికి నిరోధించవచ్చని అంచనా వేసింది.

Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ – బుష్రాల వివాహం..ఇస్లాం విరుద్ధం

వరస్ట్ సినారియోలో బర్డ్ ఫ్లూ రకం వైరస్ రూపాంతరం చెంది మానవుడి నుంచి మానవుడకి సంక్రమిస్తే ఇది యూకేలో ఒకే రోజు 15,000 మందిని చంపవచ్చని ఎయిర్ ఫినిటీ తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారితో, ప్రపంచానికి ముప్పు వాటిల్లితే ఎలా ఎదుర్కోవాలనే దానికి సిద్ధంగా ఉందని తెలిపింది. గత రెండు దశాబ్ధాలుగా SARS, MERS మరియు Covid-19 లకు కరోనా వైరస్లు కారణం అయ్యాయి. 2009లో స్వైన్ ఫ్లూ కూడా కనిపించింది.

H5N1 బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందడం ఇప్పటికే ఆందోళన కలిగిస్తోందని, ఇది ఇప్పటి వరకు తక్కువ మంది ప్రజలకు మాత్రమే సోకిందని, మానవుల నుంచి మానవుడికి వ్యాపించే అవకాశం లేదని, అయితే పక్షులు మాత్రం దీంతో ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయని సంస్థ వెల్లడించింది. మెర్స్, జికా వంటి వ్యాధులకు వ్యాక్సిన్లు , చికిత్సలు ఆమోదించబడలేదు. అయితే ఇప్పుడున్న నిఘా విధానాలు కొత్త మహమ్మారిని సకాలంలో గుర్తించే అవకాశం లేదని ఎయిర్ ఫినిటీ తెలిపింది.

Show comments