Site icon NTV Telugu

Earthquake: న్యూజిలాండ్‌‌లో భారీ భూకంపం.. అధికారుల అప్రమత్తం

Earthquake

Earthquake

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. అయితే భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రివర్టన్ తీరంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం… ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 నుంచి 6.8 మధ్య ఉన్నట్లుగా పేర్కొంది. భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో ఏర్పడినట్లుగా తెలిపింది. ఆస్తి, ప్రాణ నష్టాల గురించి ఇంకా వార్తలు అందలేదు. భూప్రకంపనలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇది కూడా చదవండి: Shihan Hussaini : పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ అనారోగ్యంతో మృతి…

భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. భయంతో జనాలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. భూకంపం సున్నితమైన జోన్‌లో సంభవించడంతో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు వెల్లడించలేదు.

 

Exit mobile version