USA-Russia: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాస్కో- అమెరికాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే యూఎస్ లోని డిఫెన్స్ కంపెనీలపై రష్యా దాడులు చేసే ఛాన్స్ ఉందని ఆ దేశ ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసింది. ఈ మేరకు నేషనల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. అలాగే, ఐరోపాలో రష్యా చేసే విధ్వంసకర కార్యకలాపాలు యూఎస్ కు చెందిన డిఫెన్స్ కంపెనీలను ప్రమాదంలోకి నెట్టింది. అమెరికాలోని రక్షణ వ్యవస్థలు గల కంపెనీలు ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధంలో కీవ్‌కు సపోర్టు ఇచ్చే సంస్థలన్నీ అలర్టుగా ఉండాలని హెచ్చరించింది. అవి తమ రక్షణ వ్యవస్థను పెంచుకోవాలని పేర్కొనింది.
Read Also: Kim Jong Un: అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతోంది.. మాతో శత్రుత్వం మంచిది కాదు..!
అయితే, రష్యా ఇంటెలిజెన్స్ ఇటీవల కాలంలో యూకే, పోలాండ్‌లలో ఉన్న స్థానిక నేరస్థులను నియమించుకుని డిఫెన్స్ కంపెనీలపై దాడులు చేయిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో నవంబర్ నెల స్టార్టింగులో జర్మనీలోని ఓ కొరియర్ హబ్‌లో, ఇంగ్లాండులోని ఓ గిడ్డంగిలో మంటలు వ్యాప్తి చెందడంతో పాటు నార్త్ అమెరికాకు వెళ్లే కార్గో విమానాల్లో ప్రమాదకర పరికరాలను అక్రమంగా ట్రాన్స్ పోర్ట్ చేయడానికి మాస్కో కుట్ర చేసినట్లు భద్రతా అధికారులు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.
Read Also: Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
ఇక, మాస్కోపై దీర్ఘశ్రేణి ఆయుధాలు వాడేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్మిషన్ ఇవ్వడంతో ఐరోపాలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దీంతో రష్యా అణ్వాయుధాలు ప్రయోగించేలా ఏర్పాట్లు చేసుకుంటుంది. అదే సమయంలో కీవ్ దళాలు రష్యా ప్రధాన భూభాగంపై క్షిపణులతో దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా రష్యా దాడి చేసే అవకాశం ఉందనే భయంతో ఇప్పటికే కీవ్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖళీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో మాస్కో దాడి చేసింది. అవసరమైతే ఇతర దేశాలపైనా కూడా ఈ తరహా క్షిపణులను ప్రయోగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.