Site icon NTV Telugu

తాలిబ‌న్ల‌కు షాక్ ఇచ్చిన అమెరికా

freezes

ఆఫ్ఘ‌నిస్థాన్‌ను స్వాధీనం చేసుకుని దూకుడుమీదున్న తాలిబ‌న్ల‌కు అగ్ర‌రాజ్యం అమెరికా షాకిచ్చింది… అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘ‌నిస్థాన్ దేశానికి సంబంధించిన నిధులు ఫ్రీజ్ చేసింది. ఆఫ్ఘ‌న్ నిధులు తాలిబ‌న్ల చేతికి చిక్క‌కుండా అమెరికా ఈ ఎత్తుగ‌డ వేసిన‌ట్టుగా తెలుస్తోంది.. మొత్తంగా అమెరికా బ్యాంకుల్లోని 9.4 బిలియ‌న్ డాల‌ర్ల‌ను స్తంభింప‌చేసింది అమెరికా..మ‌రోవైపు.. ఇప్పటివరకు 3200 మందిని కాబూల్‌ నుంచి తరలించామని అమెరికా అధికార కేంద్రమైన వైట్‌హౌస్‌ ప్రకటించింది. అమెరికా రక్షణ విమానాల ద్వారా ఇప్పటి వరకు 3200 మందిని ఆఫ్ఘన్‌ నుంచి తరలించామని, అందులో 1100 మంది అమెరికా పౌరులు, యూస్‌లో శాశ్వత నివాసం కలిగినవారు ఉన్నారని తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 1100 మందిని 13 విమానాల్లో అమెరికాకు తీసుకెళ్లామని పేర్కొంది. మిగ‌తా 2 వేల మంది ఆఫ్ఘనిస్థాన్‌కు చెందినవారని, మరింత మంది ఆ దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది. కాగా, ఆఫ్ఘన్‌ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

Exit mobile version