NTV Telugu Site icon

అమెజాన్ అధిప‌తి కీల‌క వ్యాఖ్యలు: ఆ సంస్థ‌ల‌ను అంత‌రిక్షానికి త‌ర‌లించాలి…

అమెజాన్ అధిప‌తి జెఫ్ బెజోస్ త‌న బ్లూఆరిజిన్ సంస్థ‌కు చెందిన న్యూషెప‌ర్డ్ వ్యోమ‌నౌక‌లో అంత‌రిక్షంలోకి వెళ్లొచ్చిన సంగ‌తి తెలిసిందే.  అంత‌రిక్షంలోకి వెళ్లొచ్చిన త‌రువాత ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  మ‌నం అద్భుత‌మైక గ్ర‌హంలో నివ‌శిస్తున్నామ‌ని, వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న పెను మార్పుల కార‌ణంగా భూమిపై మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారే అవ‌కాశం ఉందని, ఈ ప‌రిస్థితుల నుంచి భూమిని ర‌క్షించుకోవాలంటే త‌ప్ప‌ని స‌రిగా కాలుష్యాన్ని త‌గ్గించుకోవాల‌ని, కాలుష్యానికి కార‌ణ‌మౌతున్న ఫ్యాక్ట‌రీల‌ను అంత‌రిక్షానికి త‌ర‌లించాల‌ని అన్నారు.  

Read: వెంకీ కుడుముల కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!

అంత‌రిక్షం నుంచి చూస్తే మ‌న వాతావ‌ర‌ణం ఎంత ప‌లుచ‌నైందో తెలుస్తుంద‌ని, అస‌లు న‌మ్మ‌శ‌క్యంగాని దృశ్యం అని అన్నారు.  నేల‌మీద ఉన్న‌ప్పుడు ఇది ఎంతో పెద్ద‌దిగా అనిపిస్తుంద‌ని, ఏం చేసినా చెల్లిపోతుందిలే అనే భావ‌న క‌లుగుతుంద‌ని, కానీ అంత‌రిక్షంలోకి వెళ్ళిన త‌రువాత ఆలోచ‌నా విధానం మారిపోతుంద‌ని అన్నారు.  వ‌ర్జిన్ గెల‌క్టిక్ ద్వారా వ‌ర్జిన్ ఎయిర్‌లైన్స్ అధినేత వారం క్రిత‌మే అంత‌రిక్షంలోకి వెళ్లొచ్చారు. ఆ యాత్ర జ‌రిగి వారం కాక‌ముందే జెఫ్ బెజోస్ న్యూషెప‌ర్డ్ లో 100 కిలోమీట‌ర్ల అంత‌రిక్షంలోకి వెళ్లొచ్చారు.