Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉందంటే..!

  • అంగరంగ వైభవంగా జరిగిన అనాథ బాలిక పెళ్లి
  • రాత్రికి రాత్రే మారిపోయిన బాలిక జాతకం
  • అత్యంత రద్దీగా వివాహంగా మారిన అనాథ పెళ్లి
Orphan Bride

Orphan Bride

ఆ బాలిక ఓ అనాథ. ప్రపంచంలో నా అన్నవాళ్లు ఎవరూ లేరు. అయితే పెళ్లి చేసుకోవడానికి ఓ యువకుడు ముందుకొచ్చాడు. అయితే వచ్చే అతిథులకు విందు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. అయితే పెళ్లికి రెండు రోజుల ముందు ఆమె తలరాత మారిపోయింది. ఓ టీవీ యాంకర్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ‘‘నీకు ఏం కావాలి?’’ అని టీవీ వ్యాఖ్యాత అడిగింది. దానికి అనాథ బాలిక.. తన పెళ్లికి వచ్చే అతిథులకు భోజనం పెట్టడానికి పొరుగు వారు ఎవరైనా రెండు కోళ్లు దానం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలిక చేసిన మనవి యావత్తు దేశాన్ని కన్నీరు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇంకేముంది రాత్రికి రాత్రే ఆమె జాతకం మారిపోయింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వేలాది మంది ఆమె పెళ్లికి హాజరై.. ఇల్లు సరిపోనంతగా బహుమతులు తెచ్చి ఇచ్చారు. ఒక వ్యాపారి అయితే విలువైన ఆభరణాలు ఇచ్చాడు. దేశాన్ని కన్నీరు పెట్టించిన ఆమె వెనుక ఉన్న కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

వధువు పేరు షహరాజాద్.. అనాథ. ఉత్తర ఆఫ్రికాలోని అల్జీరియా ప్రాంతానికి చెందిన వాసి. బాలిక పెళ్లికి రెండు రోజుల ముందు ఒక టీవీ వ్యాఖ్యాత కలిసి ‘నీకు ఏం కావాలి’’ అని అడిగింది. దానికి చాలా అమాయకంగా సమాధానం ఇచ్చింది. తన పెళ్లికి వచ్చే అతిథులకు వడ్డించడానికి పొరుగువారు ఎవరైనా రెండు కోళ్లు దానం చేయాలని అడిగింది. అమాయకంగా బాలిక చేసిన విజ్ఞప్తి వేగంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకేముంది అల్జీరియా మొత్తం బాలిక కుటుంబంగా మారిపోయింది. దేశమంతా అనాథకు అండగా నిలిచారు. వేలాది మంది ఆమె పెళ్లికి హాజరై ఇల్లు సరిపోనంతగా ఖరీదైన బహుమతులు తెచ్చి ఇచ్చారు. కొందరు బంగారు ఆభరణాలు కూడా తెచ్చి ఇచ్చారు. ఈ పరిణామంతో బాలిక ఉబ్బితబ్బిబ్బు అయింది. ఒక ఆభరణాల వ్యాపారి అయితే షహరాజాద్‌కు రెండు బంగారు ఆభరణాల సెట్‌ను బహుమతిగా ఇచ్చాడు.

షహరాజాద్ వివాహానికి వేలాది మంది హాజరై దీవించారు. ఈ వేడుక అల్జీరియన్ల ఐక్యతను, ఇతరుల ఆనందంలో పాలుపంచుకోవాలనే సందేశం తెలియజేసింది. అల్జీరియాలో ఇప్పటివరకు జరిగిన వివాహ వేడుకలన్నింటిలోకీ ఇదే అత్యంత రద్దీగా, ఉత్సాహభరితంగా జరిగిందని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.