Site icon NTV Telugu

Albert Einstein: ఐన్‌స్టీన్ సంతకంతో కూడిన ప్రతులకు వేలంలో భారీ ధర..

Albert Einstein

Albert Einstein

Albert Einstein: ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సంతకంతో ఉన్న ప్రసిద్ధ రచనలకు భారీ ధర పలికింది. సాపేక్ష సిద్ధాంతం(1905), జనరల్ రిలేటివిటీ(1915) సిద్ధాంతాల అభివృద్ధిని వివరిస్తూ రాసిన అరుదైన ఆటోగ్రాఫ్ మాన్యుస్క్రిప్ట్ వేలంలో రూ.10.7 కోట్ల భారీ ధర దక్కించుకుంది. ఇటీవల జరిగిన ‘20/21 సెంచరీ ఆర్ట్ ఈవినింగ్ సేల్’పేరుతో సెప్టెంబర్ 23న వాల్డోర్ఫ్ ఆస్టోరియా షాంఘైలో ఈ వేలం జరిగింది.

Read Also: NIA Raids: ఖలిస్థానీ-గ్యాంగ్‌స్టర్స్ దోస్తీపై ఎన్‌ఐఏ నజర్.. 6 రాష్టాల్లోని 51 ప్రాంతాల్లో దాడులు

ఫిబ్రవరి 3, 1929న న్యూయార్క్ టైమ్స్ స్పెషల్ సప్లిమెంట్ లో జర్మన్ భాషలో రాయబడిని ఈ ప్రతులను తొలిసారిగా ప్రచురించబడింది. ఐన్ స్టీన్ తన ప్రముఖమైన ఈ రెండు సిద్ధాంతాల అభివృద్ధిని వివరించేందుకు తన సంతకంతో ఈ ప్రతులను రాశాడు. దీంతో ఈ అరుదైన ప్రతులకు వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది.

14 పేజీలు కలిగిన ఈ ప్రతులు ‘రిలేటివిటీ’ ఆవిష్కరణ చరిత్రను వివరిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందనే విషయంతో పాటు ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ రిలేటివిటీ సైకిల్‌ని పూర్తి చేసే అవకాశాలను వివరిస్తుంది. ఈ రెండు సమీకరణాలతో పాటు, స్పేస్-టైమ్ కంటిన్యూస్ నిర్మాణాన్ని వివరించే డయాగ్రామ్స్, సైంటిఫిక్ ఫార్ములాలు ఉన్నాయి.

Exit mobile version