Site icon NTV Telugu

అక్క‌డ మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా… అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం…

క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ర‌లా విజృంభిస్తోంది.  కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  ఇప్ప‌టికే రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.  కొన్ని నెల‌ల క్రితం దేశంలో జీరో కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని న్యూజిలాండ్ దేశం సంబ‌రాలు చేసుకున్న‌ది.  వేల మందితో క‌లిసి మ్యూజిక్ క‌న్స‌ర్ట్‌ను నిర్వ‌హించారు.  అయితే, అది కొంత‌కాల‌మే అని మ‌రోమారు తేలిపోయింది.  చాలా కాలం త‌రువాత రాజ‌ధాని ఆక్లాండ్‌లో క‌రోనా కేసు న‌మోద‌వ్వ‌డంతో ఆ న‌గ‌రంలో లాక్‌డౌన్‌ను విధించారు.  లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ ఆ న‌గ‌రంలో కేసులు పెరుగుతున్నాయి.  శ‌నివారం రోజున అక్లాండ్ న‌గ‌రంలో కొత్త‌గా 19 కేసులు న‌మోద‌వ్వ‌డంతో ఆ దేశ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.  క‌రోనా క‌ట్ట‌డికి మ‌ళ్లీ క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టింది.  మాస్క్‌తో పాటు సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు, నిబంధ‌న‌లు పాటించాల‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  

Read: అక్కడ లాక్‌డౌన్‌ పొడిగింపు.. వ్యతిరేకంగా ఆందోళనలు

Exit mobile version