Site icon NTV Telugu

తాలిబ‌న్ల‌కు షాక్‌: తిరుగుబాటుదారుల దాడిలో 11 మంది మృతి…

బ‌గ్లాన్ ప్రావిన్స్‌పై ప‌ట్టు సాధించేందుకు తాలిబ‌న్లు ప్ర‌య‌త్నిస్తున్నారు.  ఒక‌వైపు పొలిటిక‌ల్‌గా డీల్ కుదుర్చుకుందామ‌ని చెబుతూనే సెర్చ్ ఆప‌రేష‌న్ చేస్తున్నారు.  న‌లుగురు చిన్నారుల‌ను, ముగ్గురు మ‌హిళ‌ల‌ను తాలిబ‌న్లు కాల్చిచంపారు.  దీనికి ప్ర‌తీకారంగా తిరుగుబాటుదారులు తాలిబ‌న్ల‌పై విరుకుప‌డ్డారు.  తిరుగుబాటుదారులు జ‌రిపిన కాల్పుల్లో11 మంది తాలిబ‌న్లు మృతిచెందారు. తాలిబ‌న్ క‌మాండ‌ర్‌తో స‌హా ఏడుగురు తాలిబ‌న్ల‌ను తిరుగుబాటుదారులు బంధించారు.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఎలాగైనా అరాచ‌క‌పాల‌న‌ను పార‌ద్రోలి తిరిగి ప్ర‌జాస్వామ్యాన్ని తీసుకొచ్చేందుకు తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు.  

Read: తాలిబ‌న్ల కోసం రంగంలోకి దిగిన ర‌ష్యా… వారితో చ‌ర్చ‌ల‌కు సిద్ధం…

Exit mobile version