Site icon NTV Telugu

Afghanistan: నా తల్లులు, అక్కచెల్లెళ్లకు లేని విద్య నాకెందుకు.. లైవ్‌లోనే సర్టిఫికేట్లు చించేసిన ఫ్రొఫెసర్

Afghanistan

Afghanistan

Afghan professor tears diploma certificates in protest against women university ban: తాలిబాన్ ఏలుబడిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. తాలిబాన్ పాలకులు మహిళ విద్యపై ఉక్కుపాదం మోపారు. యూనివర్సిటీల్లోకి మహిళను నిషేధించారు. విద్యార్థినులు ఎంతగా ఆందోళన నిర్వహించినా.. తాలిబాన్లు పట్టించుకోవడం లేదు. చదువుకోకపోవడం కంటే తమ తలలు నరికేయడమే బెటర్ అని అక్కడి యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కులకు కూడా వీధుల్లో తిరిగే స్వేచ్ఛ ఉందని కానీ మహిళలకు అలాంటి స్వేచ్ఛ లేదని అంటున్నారు. అధికార మార్పిడి సమయంలో స్త్రీల విద్యకు అనుమతి ఇస్తామని ప్రకటించిన తాలిబాన్లు క్రమంగా తమ నిజస్వరూపాన్ని బయటకు తీస్తున్నారు.

Read Also: Rohit Reddy: నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ

ఇదిలా ఉంటే ప్రొఫెసర్ లైవ్ లోనే తన ఆవేదనను వ్యక్తపరిచిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మాారింది. కాబూల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆఫ్ఘనిస్తాన్ లో మహిళ విద్యను బ్యాన్ చేయడంపై లైవ్ లో లోనే.. తన అక్కాచెల్లిళ్లకు, తల్లులకు లేని విద్య నాకెందుకు అని తన డిప్లోమా సర్టిఫికేట్లు చించేశాడు. ఈ రోజు నుంచి నాకు ఈ డిప్లమాలు అవసరం లేదు.. ఎందుకంటే ఈ దేశంలో విద్యకు చోటు లేదని వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను సామాజిక కార్యకర్త షబ్నం నసిమి షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేసింది.

తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా మహిళా హక్కులను తొలగిస్తున్నారు. హిజాబ్ తప్పని సరి చేయడంతో పాటు మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించి వారిని ఇళ్లకే పరిమితం అయ్యేలా చేశారు. చివరకు బజార్ వెళ్లాలన్నా..ఇంట్లో పురుషులను తోడుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్కులు, జిమ్ లకు మహిళలు నిషేధించారు. చివరకు ప్రజలు సేవ చేసే ఎన్జీవోల్లోకి మహిళా ఉద్యోగులను తీసుకోకూడదని తాజాగా నిషేధం విధించింది తాలిబాన్ సర్కార్.

Exit mobile version