NTV Telugu Site icon

Bangladesh ISKCON: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ పై దాడి.. పరిస్థితి విషమం

Bangladesh

Bangladesh

Bangladesh ISKCON: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టైన ప్రచారకర్త చిన్మయ్ కృష్ణ దాస్ తరపు లాయర్ రమణ్ రాయ్‌పై దాడి జరగడంపై ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్‌) స్పందించింది. ఇస్కాన్ ప్రతినిధి రాధా రమణ్‌ దాస్ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థనలు చేయండిని కోరారు. అతను చేసిన ఒకే ఒక తప్పు చిన్మయ్ కృష్ణ కోసం న్యాయస్థానంలో వాదించడం.. ముస్లీంలు అతని ఇంటిని ధ్వంసం చేసి.. దాడి దారుణం.. ప్రస్తుతం ఆయన ప్రాణాలతో పోరాటం చేస్తున్నారని రాసుకొచ్చారు.

Read Also: PV Sindhu Marriage: డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి.. వరుడు ఎవరంటే?

కాగా, బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు లాయర్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు తరపు అడ్వకేట్ హత్యకు గురయ్యాడంటూ గత నెలలో నెట్టింట కొన్ని వార్తా కథనాలు ప్రచారం చేశారు. అయితే, ఈ ప్రస్తావనలో వచ్చిన న్యాయవాది పేరు సైఫుల్ ఇస్లాం అని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆయన సర్కార్ తరపు లాయర్ అని.. అతను చిన్మోయ్ దాస్ కేసులో వాదించలేడని సమాచారం. బంగ్లాలోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్ ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు సపోర్టుగా జరిగిన నిరసనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేసి.. దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఢాకా న్యాయస్థానం అతనికి బెయిల్ నిరాకరించింది. ఇక, బంగ్లా మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుంచి మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. అలాగే, బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్‌ దాస్ ఆరోపించారు.

Show comments