Site icon NTV Telugu

Srilanka Crisis: శ్రీలంకలో అత్యవసర పరిస్థితి.. రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం

Srilanka's Acting President

Srilanka's Acting President

Srilanka Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రణిల్ విక్రమసింఘే వెల్లడించారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సామగ్రి, ఇంధనం అందించేందుకు చర్యలు చేపట్టేందుకే ఈ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఆయన గెజిట్ నోటిఫికేషన్‌ ద్వారా తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40(1)సి ప్రకారం శ్రీలంక అత్యవసర పరిస్థితి విధించినట్లు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. దేశంలో జులై 18 నుంచి ఎమర్జెన్సీ అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

Indiana Mall Shooting: అమెరికాలోని ఇండియానా మాల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలోని పౌరులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తూ దేశంలో హింసాత్మక ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోయారు. గొటబాయ రాజపక్స దేశం విడిచిపెట్టి వెళ్లిన తర్వాత శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం శ్రీలంకలో పరిస్థితులను చక్కదిద్దే పనుల్లో తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

Exit mobile version