Site icon NTV Telugu

ఆఫ్ఘ‌నిస్థాన్‌ కొత్త ప్రెసిడెంట్ ఈయ‌నే..|

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్ల వ‌శం అయిపోయింది.. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు అష్ర‌ఫ్ ఘ‌నీ దేశం విడిచి పారిపోయాడు.. దీంతో ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల రాజ్యం వ‌చ్చేసింది.. ఇక‌, కొత్త అధ్య‌క్షుడి ఎంపిక‌పై దృష్టిసారించారు తాలిబ‌న్లు.. ఈ క్ర‌మంలో తాలిబ‌న్ కోఫౌండ‌ర్ ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది.. ఆఫ్ఘ‌న్ శాంతి చ‌ర్చ‌ల స‌మ‌యంలో అత్య‌ధికంగా అంద‌రి నోళ్ల‌లో నానిన‌పేరు ఇది.. ఇంత‌కీ.. ఎవ‌రీ ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్‌.. ఆయ‌న‌కు తాలిబ‌న్ సంస్థ‌కు ఉన్న సంబంధం ఏంటి? తాలిబ‌న్ ఫౌండ‌ర్ ముల్లా ఒమ‌ర్ త‌ర్వాత అంత‌టి ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌గా ఎలా ఎదిగాడు అనే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది..

ఆఫ్ఘాన్‌లోని కాంద‌హార్ అనే ప్రాంతంలో పుట్టినపెరిగాడు ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్.. ఇక‌, కాంద‌హార్ అన‌గానే గుర్తొచ్చే పేరు తాలిబ‌న్లు.. తాలిబ‌న్ సంస్థ పురుడుపోసుకుంది కూడా అక్క‌డే.. అఫ్ఘాన్ ప్ర‌జ‌ల‌లాగానే.. అబ్దుల్ ఘ‌నీ కూడా సోవియెట్ సేనల దాడికి గుర‌యిన‌వాడే. అదే ఆయ‌న్ను సోవియెట్ సేన‌ల‌పై తిరుగుబాటు చేసేలా ఉసికొల్పింది. ఇక‌, ముల్లా ఒమ‌ర్‌తో క‌లిసి సోవియెట్ సేన‌పై పోరాటం చేశాడు. తాలిబ‌న్ల పోరాటంలో కీల‌క భూమిక పోషించిన ఆయ‌న‌.. ఎన్నో నిర్భంధాల‌ను ఎదుర్కొన్నాడు.. జైలు జీవితాన్ని గ‌డిపారు.. ఇక‌, ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్ కు సంబంధించిన మ‌రింత స‌మాచారం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..

Exit mobile version