A Woman Carries A Lion In Her Arms Video Going Viral: ఎవరికైనా సింహం కనిపిస్తే ఏం చేస్తారు? వెంటనే పరుగులు పెడతారు. దాని కంటపడకుండా, ఎక్కడైనా దాక్కోవడానికి ప్రయత్నిస్తారు. అఫ్‌కోర్స్.. అప్పటికే ప్యాంట్లు తడిసిపోయుంటాయి. అయితే ప్రాణాలు కాపాడుకోవడానికి శక్తినంతా కూడబెట్టుకొని, సూపర్‌మ్యాన్‌లా ఒకటే పరుగు లంకిస్తారు. ఎందుకంటే.. అది క్రూరమైన జంతువు. కంటపడితే.. వెంటపడి మరీ చంపేస్తుంది. అందుకే, దాని జోలికి ఎవ్వరూ వెళ్లరు. కానీ.. ఒక మహిళ మాత్రం ఎలాంటి బెరుకులేకుండా, ఏదో పిల్లిని ఎత్తుకెళ్తున్నట్లు తన చేతుల్తో సింహాన్నే మోసుకెళ్లింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నన్ను విడిచిపెట్టమంటూ చిన్నపిల్లాడు ఎలా మారాం చేస్తాడో, ఆ సింహం కూడా అలాగే మారాం చేయడాన్ని మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. నిజానికి.. ఇది పాత వీడియోనే! కానీ, ఇప్పుడు మళ్లీ ఇది వైరల్ అవుతోంది.
Delhi Car Horror: అంజలి రోడ్డు ప్రమాదం కేసు.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
ఈ వీడియోలో ఒక మహిళ ఓ సింహాన్ని తన చేతులతో ఎత్తుకొని, వీధిలో నడుస్తుండటాన్ని మనం చూడొచ్చు. ఆమె చేతిలో నుంచి సింహం తప్పించుకోవడానికి నానాతంటాలు పడుతోంది. చిన్న పిల్లాడు ఎలాగైతే ఒళ్లోనే గెంతులేస్తారో, ఆ సింహం కూడా సరిగ్గా అలాగే హడావుడి చేస్తుంది. ‘నన్ను కిందకు దింపు, నన్ను విడిచిపెట్టు’ అన్నట్టు అది పట్టుబడుతోంది. కానీ.. ఆ మహిళ మాత్రం తన చేతుల నుంచి సింహం జారకుండా, మరింత గట్టిగా పట్టుకుంది. అయినా, అంత ధైర్యంగా ఆమె ఆ సింహాన్ని ఎలా పట్టుకుంది? ఆ సింహం ఎందుకు ఏం చేయకుండా మౌనంగా ఉంది? అనేగా మీ సందేహం. అది ఆమె పెంపుడు సింహం. ఈ ఘటన కువైట్ సిటీలో చోటు చేసుకుంది. అది ఇంట్లో నుంచి తప్పించుకొని, నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి, ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. ఈ విషయం తెలిసి, యజమానురాలు దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లింది. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని నెటిజన్లు చూసి షాక్ అవుతున్నారు. ఆ మహిళ సాహసాన్ని మెచ్చుకుంటూ.. వండర్ వుమన్‌గా కొనియాడుతున్నారు. మరికొందరైతే.. ఆ పిల్లి అనుకున్నారా లేక కుక్క అనుకుంటున్నారా? అలా ఎత్తుకెళ్తున్నారంటూ సంభ్రమాశ్చర్యాలను వ్యక్తపరుస్తున్నారు.
Carrot Juice : క్యారెట్ జ్యూస్ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!