China: డ్రాగన్ కంట్రీ చైనాలో యువకుల ఉన్మాద చర్యలు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తుంది. తాజాగా తూర్పు నగరం వుషీలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. 21 ఏళ్ల యువకుడు కాలేజ్ క్యాంపస్‌లో కత్తితో నానా హంగామా సృష్టించాడు. విచక్షణారహితంగా కత్తితో స్టూడెంట్స్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వుషీ వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్ అని, పరీక్షలో ఫెయిల్ కావడంతోనే.. డిగ్రీ సర్టిఫికెట్ అందుకోలేకపోవడం, ఇంటర్న్‌షిప్ స్కాలర్ షిప్ రాకపోవడంతో ఉన్మాదిగా ప్రవర్తించాడని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ల వెల్లడించారు. ఈ ఘటన అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తోంది.
Read Also: Rammurthy Naidu: నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతికకాయం.. అంత్యక్రియలకు సీఎం చంద్రబాబు!
ఇక, చైనాలోని దక్షిణ నగరమైన జూహైలో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడుపుతూ పాదచారులపైకి ఎక్కించాడు. దీంతో దాదాపు 30 మందికి పైగా మృతి చెందారు. మరో 43 మంది ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన ఉన్మాది.. ఆ తర్వాత కత్తితో తన మెడ కోసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ సైకో ఆసుపత్రిలో చేర్పించారు.. ప్రస్తుతం అతను కోమాలో ఉన్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.