NTV Telugu Site icon

Brazil: బ్రెజిల్‌లో బస్సును ఢీకొట్టిన చిన్న విమానం.. ఇద్దరు మృతి

Brazil

Brazil

బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్న విమానం కూలిపోయింది. బస్సును ఢీకొట్టడంతో మంటలు అంటుకుని ఇద్దరు చనిపోయారు. రోడ్డుపైన దూసుకుంటూ వెళ్లి బస్సును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఇద్దరు చనిపోగా.. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

ఇది కూాడా చదవండి: India Alliance: ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇండియా కూటమి పరిస్థితి ఏంటి?

స్థానిక అగ్నిమాపక దళం అసోసియేటెడ్ మాట్లాడుతూ.. విమానం నగరంలోని బార్రా ఫండా పరిసరాల్లో డౌన్‌టౌన్‌కు సమీపంలో కూలిపోయింది. బస్సును ఢీకొట్టడంతో మహిళ గాయపడిందని చెప్పారు. అలాగే బైకిస్టు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్న మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విమానం దక్షిణ రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని పోర్టో అలెగ్రేకు వెళ్లాల్సి ఉందని చెప్పారు.

ఇది కూాడా చదవండి: Central Cabinet Decisions: స్కిల్ ఇండియా కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమానం బస్సుతో సహా అనేక వాహనాలను ఢీకొట్టింది. పోర్టో సెగురోకు వెళ్లే మార్గంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత కాంపో డి మార్టే విమానాశ్రయం కంట్రోల్ టవర్‌తో విమానం సంబంధాన్ని కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.