NTV Telugu Site icon

Man Bathing King Cobra: వీడెవడండీ బాబూ.. నాగుపాముకే స్నానం చేయిస్తున్నాడు.. వైరల్ వీడియో..

King Cobra Bathing Video

King Cobra Bathing Video

A man bathing a king cobra, VIRAL VIDEO: సాధారణంగా పాములను చూస్తేనే మనుషులు ఆమడదూరం పరిగెడుతారు. పాములు కనిపిస్తే చంపనిదే వదలరు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బాత్ రూమ్ లో ఓ కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్నాడు. ఎలాంటి బెదురు లేకుండా ఏదో పెంపుడు కుక్కకు స్నానం చేయిస్తున్న మాదిరిగా నాగుపాముకు స్నానం పోస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ చలిలో పాముకు నీళ్లతో స్నానం చేయిస్తున్నా అంటూ క్యాప్షన్ పెట్టి వీడియోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

Read Also: Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ హెచ్చరిక

22 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో బాత్‌రూమ్‌లో ఒక వ్యక్తి నాగుపాముకు స్నానం చేయించడం కనిపిస్తుంది. మగ్ తో బకెట్ లోని నీటిని తీసి పాము పడగపై పోస్తుంటాడు. ఆ సమయంలో పాము పడగ విప్పి ఉండటం వీడియోలో చూడవచ్చు. ఆ పాము కూడా స్నానాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విట్టర్ లో 24,000 వ్యూస్, 716 లైక్స్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. సదరు వ్యక్తి ధైర్యాన్ని నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు.

కింగ్ కోబ్రా(నాగుపాము) ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము. అన్ని పాముల్లోకెల్లా పొడవైంది. సాధారణంగా నాగుపాము 10 నుంచి 12 అడుగుల పొడవు పెరుగుతుంది. పూర్తిగా తన తోకపై నిలబడే సామర్థ్యం కలిగి ఉంటుంది. నాగుపాము విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి. ఇవి కాటు వేస్తే విషం మెదడు, నరాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు నరాల మధ్య విద్యుత్ సంకేతాలకు ఆటంకం కలిగించి, శ్వాస ఆగిపోయేలా, పక్షవాతం వచ్చే చేసి చంపేస్తుంది. ఒక్కకాటులో 20 మందిని చంపే సామర్థ్యం ఉంటుంది నాగుపాముకు.