A Couple Selfie Pic Going Viral After Peru Plane Crash: ఏదైనా దుర్ఘటన కారణంగా మనం చనిపోతున్నామని ఫిక్స్ అయినప్పుడు, అనూహ్యంగా దాన్నుంచి బయటపడితే ఎలా ఉంటుంది? ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. జీవితం తమకు మరో అవకాశం ఇచ్చిందనుకొని.. సంబరాలు జరుపుకుంటాం. అలాంటి అవకాశమే 120 మందికి పైగా ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి వచ్చింది. ప్లేన్ క్రాష్ అవ్వడంతో.. ఇక తాము చావడం తథ్యమని అనుకున్నారు. కానీ, ఆశ్చర్యకరంగా వాళ్లంతా సేఫ్‌గా బయటపడ్డారు. ఎవ్వరికీ పెద్దగా గాయాలు కూడా కాకపోవడం మరో విశేషం.
ఆ వివరాల్లోకి వెళ్తే.. పెరూ రాజధాని లిమాలోని విమానాశ్రయం నుంచి ఒక విమానం టేకాఫ్ అయ్యింది. మరికొన్ని గంటల్లో తామంతా తమ గమ్యస్థానానికి చేరుకోబోతున్నామని.. ఆ విమానంలో కూర్చుకున్న ప్రయాణికులంతా ఆనందంగా ఆ ఘడియల్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, ఇంతలోనే ఎవ్వరూ ఊహించని ఓ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ అవుతున్న సమయంలో.. ఆ విమానం రన్‌వేలో ఉన్న అగ్నిమాపక వాహనాన్ని డీకొట్టింది. దీంతో.. మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదం పెద్దదే కావడంతో.. అందులో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది సైతం ఇక తమ చావు తథ్యమని అనుకున్నారు. అందరూ దేవుడ్ని ప్రార్థించడం మొదలుపెట్టారు.
బహుశా వీరి ప్రార్థనల్ని ఆ దేవుడు స్వీకరించినట్టు ఉన్నాడు, అందుకే అంత పెద్ద ప్రమాదం అయినా ఏ ఒక్కరూ చనిపోలేదు. సిబ్బందితో పాటు దాదాపు 120 మంది ప్రయాణికులంతా సురక్షితంగా బయటపట్టారు. చావు అంచులదాకా వెళ్లి బయటపడిన సందర్భం కాబట్టి.. ఈ నేపథ్యంలో ఓ జంట ప్లేన్ క్రాష్ అయిన చోటే సెల్ఫీ తీసుకుంది. జీవితం తమకు మరో అవకాశం ఇచ్చిందన్న ఆనందంతో, సెల్ఫీతో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని వాళ్లు తెలిపారు. ఈ సెల్ఫీ ఫోటోను ఏ320 సిస్టమ్స్ అనే ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, ‘సెల్ఫీ ఆఫ్ ద ఇయర్’ అనే క్యాప్షన్ పెట్టారు. దాంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.