NTV Telugu Site icon

Brain Chip: బ్రెయిన్‌లో చిప్‌.. చివరకు ఏమైందంటే..?

Brain Chip

Brain Chip

Brain Chip: మనిషి తనకు మంచి కలలు రావాలని కోరుకుంటాడు. కలలో వచ్చినవి నిజం కావాలని కోరుకుంటాడు. కానీ తనకు వచ్చే కలలనే నియంత్రణ చేసుకోవాలని అనుకున్నాడో వ్యక్తి. అనుకోవడమే తరువాయి అందుకోసంప్లాన్‌ సిద్ధం చేసుకొని.. తన కలలను నియంత్రించడం కోసం సాంకేతికతను ఉపయోగించుకోవాలనుకున్నాడు. అందుకు తనే స్వయంగా తన బ్రెయిన్‌కు ఆపరేషన్‌ చేసుకొని చిప్‌ను ఎర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అనుకోవడం వరకు బాగానే ఉంది. తన ఆపరేషన్‌ పూర్తి కాలేదు.. ఇంతలోనే అతను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.. ఎందుకంటే?

Read also: James Cameron : AI పై హాలివుడ్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..

కలలను నియంత్రించాలనే లక్ష్యంతో ఓ వ్యక్తి చేసిన ప్రమాదకర పని.. అతడిని చావు అంచులకు తీసుకెళ్లింది. డ్రిల్లింగ్‌ యంత్రం సాయంతో తన తలకు తానే రంధ్రం చేసుకుని.. మెదడు వద్ద చిప్‌ అమర్చుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావానికి గురైన అతడిని ఆస్పత్రిలో చేర్చడంతో చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక వార్తాసంస్థల వివరాల ప్రకారం.. కజకిస్థాన్‌కు చెందిన మిఖాయిల్‌ రాదుగా(40) అనే వ్యక్తి తన కలలను నియంత్రించాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌లో సమాచారం సేకరించడంతోపాటు న్యూరో సర్జరీల వీడియోలు చూశాడు. వాటి ఆధారంగా డ్రిల్లింగ్‌ మిషన్‌ కొనుక్కొని.. స్వయంగా తలకి రంధ్రం చేసుకున్నాడు. ఆపై ఎలక్ట్రోడ్‌ చిప్‌ను అమర్చుకున్నాడు. నాలుగు గంటలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా అతడికి తీవ్ర రక్తస్రావం అయింది. దాదాపు లీటర్‌ రక్తం కోల్పోవడంతో అది కాస్త ప్రాణాల మీదికి వచ్చింది. చివరకు ఆస్పత్రిలో చేర్చడంతో బతికి బయటపడ్డాడు. తాను చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫొటోలను అతడు ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు.

Read also: Cold And Cough Mistakes: జ్వరం, జలుబు ఉన్నప్పుడు.. ఈ తప్పు అస్సలు చేయవద్దు!

‘మెదడుపై స్వయంగా ఎలక్ట్రోడ్ ఇంప్లాంటేషన్ చేశాను. తద్వారా మెదడులోని ఓ భాగంలో ఎలక్ట్రిక్‌ స్టిమ్యులేషన్‌ నిర్వహించాను. కలలు కనేటప్పుడు మెదడు ఉద్దీపనను పరీక్షించడానికి ఇది అవసరం. ఇటువంటి ప్రయోగం చరిత్రలో ఇదే మొదటిసారి’ అని అతడు తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ ప్రయోగ ఫలితాలు.. కలల నియంత్రణ సాంకేతికతలకు అవకాశాల ద్వారాలను తెరుస్తాయని చెప్పాడు. వాస్తవానికి ఈ శస్త్రచికిత్స కోసం మొదట్లో న్యూరో సర్జన్లను సంప్రదించాలని భావించినా.. వారిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుందని తెలియడంతో తానే చేసుకున్నట్లు ప్రకటించాడు.