Site icon NTV Telugu

8 మంది ప్రాణాలు తీసిన మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌

మ్యూజిక్ ఫెస్టివ‌ల్ అంటేను హుషారుగా సాగుతోంది.. అయితే, ఆ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ విషాదాన్ని మిగిల్చింది.. ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.. చాలా మంది అస్వస్థకు గురయ్యారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అమెరికాలో ఆస్ట్రోవ‌ర‌ల్డ్‌ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని హూస్ట‌న్‌లో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ నిర్వమిస్తున్నారు.. అయితే, స్టేజ్‌పైకి ట్రావిస్ స్కాట్ రాగానే.. ఒక్కసారిగా జ‌నం వేదిక వైపు దూసుకొచ్చారు.. దాంతో తొక్కిస‌లాట చోటు చేసుకుంది.. 8 మంది మృతిచెందారు.. మరో 17 మందిని ఆస్పత్రులకు తరలించగా.. వీరిలో 11 మంది గుండె నొప్పి వచ్చినట్టుగా వైద్యులు చెబుతున్నారు.. ఈ ఈవెంట్‌కు 50 వేల మంది వరకు మ్యూజిక్‌ లవర్స్‌ హాజరు కాగా.. సుమారు 300 మంది తీవ్ర గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నమాని.. వీడియో ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నామని హ్యూస్టన్ పోలీసులు వెల్లడించారు. దీంతో.. శనివారం కూడా కొనసాగాల్సిన మ్యూజిక్‌ ఫెస్టివల్‌ను రద్దు చేశారు అధికారులు.

Exit mobile version