రష్యా- ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం పరిస్థితులు కొంతమేర చక్కబడ్డాయి. ఉక్రెయిన్‌తో యుద్దాన్ని కోరుకోవడం లేదని రష్యా స్పష్టం చేసింది. అంతేకాదు, కొందమంది బలగాలను వెనక్కి రప్పిస్తున్నట్టు రష్యా తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎంతమంది బలగాలను, ఎక్కడి నుంచి వెనక్కి రప్పిస్తున్నారు అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే, రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవడానికి తాము సైతం సిద్దంగా ఉన్నామని ఆ దేశంలోని చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు చెబుతున్నారు. చెప్పడమే కాదు, గన్ పట్టుకోవడం, కాల్చడం వంటి వాటిల్లో శిక్షణ పొందుతున్నారు.
Read: Leopard: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయింది… తల బయటకు రాక…
తూర్పు ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌కు చెందిన 79 ఏళ్ల వాలంటీనా కోస్తాంటినోవాస్కా ఏకే 47 తుపాకీని కాల్చడంతో శిక్షణ పొందింది. తాను బలహీనురాలునే కావొచ్చు… శతృవులను ఎదుర్కొనే ధైర్యం లేకపోవచ్చు… కానీ, తన దేశాన్ని రక్షించుకోవడానికి తన ప్రాణాలు సైతం ఇస్తానని చెప్పిన మాటలు ఆ దేశంలోని ప్రజలను కదిలించాయి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందారు. ఈ బామ్మకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
