Site icon NTV Telugu

ఆ వృద్ధుడు యువ‌కుడిగా క‌నిపించేందుకు ప్ర‌య‌త్నించి… చివ‌ర‌కు…

ఇంగ్లాండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్‌కు చెందిన పీట్ అనే 79 ఏళ్ల వృద్ధుడు ప‌ళ్ల‌కు స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. అయితే, స‌ర్జ‌రీ కార‌ణంగా అత‌ని ముఖం మారిపోయింది. రూపం మారిపోయింది, బాగాలేవు అని చెప్పి అత‌ని భార్య వ‌దిలేసి వెళ్లిపోయింది. దీంతో షాకైన పీట్ ఎలాగైనా యంగ్‌గా క‌నిపించాల‌ని అనుకున్నాడు. వెంట‌నే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నాడు. అప్పుడే అసలు తిప్ప‌లు మొద‌ల‌య్యాయి. ప్లాస్టిక్ సర్జ‌రీ త‌రువాత ముఖం మ‌రింత దారుణంగా మారిపోయింది. పైగా ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయ‌డం వ‌ల‌న క‌నురెప్ప‌లు మూతపడ‌టం లేదు. క‌నురెప్ప‌లు మూత‌డ‌ప‌డం లేద‌ని, క‌ళ్లు మంట‌గా ఉంటున్నాయ‌ని చెప్పి వృద్ధుడు మ‌రోసారి ఆసుప‌త్రికి వెళ్లాడు. మ‌రోసారి స‌ర్జ‌రీ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. క‌ళ్ల మంట‌ల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు రోజుకు 8 సార్లు ఐ డ్రాప్స్ వాడాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. నిద్ర‌పోవాలంటే క‌ళ్ల‌కు గుడ్డ‌ను గ‌ట్టిగా క‌ట్టుకొని నిద్ర‌పోవాల్సి వ‌స్తుంద‌ని, రెండేళ్లుగా న‌ర‌కం అనుభ‌విస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు పీట్‌.

Read: ఇండియాలో తొలి క్రూయిజ్ ఎల‌క్ట్రిక్ బైక్… ఒక‌సారి రీఛార్జ్ చేస్తే…

Exit mobile version